Manchu Manoj : మంచు మనోజ్ రెండవ పెళ్ళికి మోహన్ బాబు రావడం లేదా.. వీళ్ళ మధ్య ఇన్ని విబేధాలు ఉన్నాయా!

- Advertisement -

Manchu Manoj : మంచు కుటుంబం లో చీలికలు మొదలయ్యాయా..? మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ ని పూర్తిగా దూరం పెట్టేశారా?,అక్క లక్ష్మి ప్రసన్న సపోర్ట్ మినహా మనోజ్ కి కుటుంబం నుండి అసలు సపోర్టు దక్కడం లేదా అంటే అవుననే అంటున్నారు ఇండస్ట్రీ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు.కారణం మనోజ్ రెండవ పెళ్లి చేసుకోబోతుండడమే.గత కొంత కాలం క్రితం మనోజ్ తన మొదటి భార్య ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకున్నాడు.

Manchu Manoj
Manchu Manoj

ఆ తర్వాత ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డి తో మనోజ్ ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు.అయితే భూమా మౌనిక రెడ్డి ని పెళ్లాడడం మోహన్ బాబు మొదటి నుండి ఇష్టం లేదట. ఈ విషయంపై మనోజ్ మోహన్ బాబు తో గొడవపడి విడిపోయినట్టు చాలా కాలం నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

మోహన్ బాబు కి ఈ పెళ్లి ఇష్టంలేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయట. అందులో ఒకటి భూమా కుటుంబం తో మొదటి నుండి మోహన్ బాబు విభేదాలు ఉన్నాయి. ఇక రెండవ కారణం ఏమిటంటే మౌనిక రెడ్డి కి అప్పటికే పెళ్ళై విడాకులు కూడా అయిపోయింది. అందుకే మోహన్ బాబు కి ఈ పెళ్లి అంటే మొదటి నుండి ఇష్టం లేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం గా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు.

- Advertisement -

కానీ ఎప్పుడైతే ఈ పెళ్లి ప్రస్తావన వచ్చిందో తరుచూ గొడవలు జరుగుతూ, చివరికి మోహన్ బాబు కొడుకులకు ఆస్తులను పనిచేసి మనోజ్ ని ఇంటి నుండి గెంటేసాడనే టాక్ ఉంది. అంత పెద్ద గొడవలు జరిగిన తర్వాత మనోజ్ రెండవ పెళ్ళికి ఇప్పుడు మోహన్ బాబు వస్తాడా రాడా అనేది పెద్ద ప్రశ్నగా నిలిచింది. మంచు మనోజ్ రెండవ పెళ్లి మంచు లక్ష్మి ప్రసన్న ఇంట్లో జరగబోతుందట, అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మోహన్ బాబు కనీసం ఆహ్వానం కి కూడా స్పందించలేదని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here