ఈమధ్య కాలం లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా కేవలం రెండు మూడు వారాల్లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఒక సెక్షన్ ఆడియన్స్ మీడియం రేంజ్ సినిమాలను థియేటర్స్ లో చూడడం ఆపేసి చాలా కాలం అయ్యింది. కరోనా లాక్ డౌన్ సమయం లో జనాలు ఓటీటీ కి బాగా అలవాటు పడిపోయారు. కానీ థియేట్రికల్ అనుభూతి తప్పనిసరి అని అనిపించిన సినిమాలను మాత్రం జనాలు బాగా ప్రోత్సహిస్తున్నారు.
కమర్షియల్ గా అలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపేస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా విడుదలైన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకి విడుదల రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో విషయం అనుకున్న రేంజ్ లో లేకపోయినా కూడా, నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో ఈ చిత్రాన్ని నిలబెట్టేసాడు.
మొదటి రోజు ఓపెనింగ్స్ పెద్దగా రాకపోయినా, రెండవ రోజు మాత్రం ఈ చిత్రం అన్నీ ప్రాంతాలలో గట్టిగా నిలబడింది. ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా వసూళ్లు రావడం లేదు కానీ, నైజాం మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో మాత్రం మంచి వసూళ్లను రాబడుతుంది ఈ చిత్రం. కేవలం 13 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా వీకెండ్ కి 90 శాతం రికవరీ అయిపోతుందని, ఫుల్ రన్ లో కనీసం మూడు కోట్ల రూపాయిలు అయినా లాభాలు వస్తాయని అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం లో కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 25 వ తారీఖున ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అప్పటిలోపు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ కూడా అయిపోతుందని అంచనా.