Meter యువ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు.వారిలో ఒకరు కిరణ్ అబ్బవరం, ఒక హిట్టు ఒక ఫ్లాప్ అన్నట్టుగా సాగిపోతున్న ఈయన కెరీర్ ఇప్పుడు ‘మీటర్’ సినిమాతో రిస్క్ లో పడింది.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా బాగానే ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ మొదటి రోజు మొదట ఆటకి వచ్చిన ప్రేక్షకులని బయపెట్టేసింది ఈ సినిమా.కమర్షియల్ సినిమాలు ఈమధ్య బాగా ఆడేస్తున్నాయని, ఏది పడితే అది తీస్తే జనాలు గాండ్రించి ఊస్తారు అనడానికి ఉదాహరణగా నిల్చింది ఈ చిత్రం.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు పాతిక లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది.ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే చెత్త ఓపెనింగ్ అని చెప్పొచ్చు.

ఇక వీకెండ్ కి అయినా పుంజుకుంటుంది అనుకుంటే ,రెండవ రోజు జీరో షేర్ వచ్చిందట.రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నీ ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకి కనీసం థియేటర్ రెంట్ ఖర్చులు కూడా రాలేదట.దాంతో రెంటల్ బేసిస్ మీద రన్నింగ్ అవుతున్న థియేటర్స్ అన్నిట్లో మీటర్ సినిమాని తీసేస్తున్నట్టు సమాచారం.కిరణ్ అబ్బవరం ముందు సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ‘ పెద్ద సూపర్ హిట్ అవ్వడం తో ‘మీటర్’ చిత్రానికి 5 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఇప్పుడు ఈ బిజినెస్ ని రీకవర్ చెయ్యడం అసాధ్యమని అంటున్నారు ట్రేడ్ పండితులు.కెరీర్ లో ఎదుగుతున్న సమయం లో ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ పడడం వల్ల కిరణ్ అబ్బవరం కెరీర్ పై చాలా ప్రభావం పడుతుంది.ఇక నుండి అయినా ఆయన డబ్బుల కోసం కాకుండా కెరీర్ పదిలంగా ఉండే సినిమాలను చెయ్యాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘రూల్స్ రంజన్’ అనే చిత్రం మే నెలలో విడుదల కాబోతుంది.ఈ సినిమాతో ఆయన సక్సెస్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.