Mehreen Pirzada టాలీవుడ్ లో హీరోలు మరియు హీరోయిన్లు సినిమాల్లో సంపాదించేదానికంటే యాడ్స్ ద్వారా సంపాదించే డబ్బులు చాలా ఎక్కువ అని అందరూ అంటుంటారు.ముఖ్యంగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి హీరోయిన్లు యాజమాన్యం ని డిమాండ్ చేసే రెమ్యూనరేషన్స్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే.ఇప్పుడు కుర్ర హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడ అదే చేస్తుందట.ఈమె ఏ ఓపెనింగ్ కి వెళ్లినా ఒక్క గంటకి 15 లక్షల రూపాయిలు ఇవ్వాల్సిందే అట.

అంతే కాదు ఆమె ఆరోజు ఉండేందుకు అవసరమయ్యే ఖర్చులన్నీ కూడా సదరు యాజమాన్యమే భరించాలట, ఆమె స్టాఫ్ ఖర్చులు కూడా వాళ్ళే చూడాలట.వీటి అన్నిటి మీద అగ్రిమెంట్ చేస్తేనే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తుందట.రీసెంట్ గా నెల్లూరు లో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పొదలకూరు సమీపం లో ఒక వెంచర్ ని వేసింది.ఈ వెంచర్ ఓపెనింగ్ కి మెహ్రీన్ పిర్జాడ వచ్చిందట.

ఆమె ఆరోజు అక్కడ ఒక గంట సేపు ఓపెనింగ్ కోసం ఉన్నందుకు గాను 15 లక్షల రూపాయిలు పారితోషికంగా అందుకుందట.మెహ్రీన్ టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ ఏమి కాదు, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే ఇదివరకు ఆమె నటించింది.ఈమె డిమాండ్ ఈ రేంజ్ లో ఉంటె ఇక కాజల్ అగర్వాల్ , తమన్నా రేంజ్ హీరోయిన్స్ కి ఏ రేంజ్ డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు.

మెహ్రీన్ ఒక్కో సినిమాకి 60 నుండి 80 లక్షల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది.అలాంటి హీరోయిన్ కి కేవలం గంట సేపు కాల్ షీట్ 15 లక్షలు అయితే రోజు మొత్తం అక్కడే ఉంటే ఇంకెంత డిమాండ్ చేసి ఉండేదో ఊహించుకోవచ్చు.కేవలం మెహ్రీన్ మాత్రమే కాదు , టాలీవుడ్ లో యంగ్ బ్యూటీస్ అందరూ ఇదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు.