Pawan Kalyan : టాలీవుడ్ లో కాంబినేషన్, హైప్ మరియు డైరెక్టర్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ పెట్టె సత్తా ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోలలో ఒకడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఖుషి సినిమా తర్వాత నుండి ప్రతీ పవన్ కళ్యాణ్ సినిమాకి జరుగుతుంది ఇదే. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా కొంతమంది డైరెక్టర్స్ తో పని చెయ్యకూడదు.

అలా పనికి రాని డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో మెహర్ రమేష్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు ఈయన తీసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఇతనితో స్టార్ హీరోలు సినిమాలు చెయ్యడం అనే విషయం పక్కన పెడితే, కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా మెహర్ తో సినిమాలు చెయ్యడానికి బయపడుతారు. అలాంటి డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే ‘భోళా శంకర్’ చిత్రం చేసాడు.

ఈ సినిమా ఎంత నీచమైన డిజాస్టర్ ఫ్లాప్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాలుగు దశాబ్దాల మెగాస్టార్ కెరీర్ లో భూతద్దం వేసి వెతికినా కూడా దొరకని రేంజ్ డిజాస్టర్ చిత్రం ఇది. మెహర్ రమేష్ చిరంజీవి కి బంధువు అవుతాడు, పవన్ కళ్యాణ్ కి ఎంతో మంచి స్నేహితుడు కాబట్టి ఆ కుటుంబ హీరోలతో ఈయన సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువ.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడమే లక్ష్యమే అని, ఆయన కోసం స్క్రిప్ట్ కూడా రాసిపెట్టుకున్నాను అంటూ కామెంట్ చేసాడు. ఇది కాస్త సోషల్ మీడియా లో లీక్ వైరల్ అయ్యి అభిమానులకు చేరడం తో ‘నువ్వు ఆలా చెప్తుంటే , పవన్ కళ్యాణ్ కెరీర్ ని సమాధి చెయ్యడమే నా లక్ష్యం అన్నట్టుగా అనిపిస్తుంది , దయచేసి మా వైపు చూడకు’ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.