ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్రాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు చిరంజీవి. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ ను ఏలే స్టేజీకి చేరుకున్నారు. మెగాస్టార్ అయి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఆన్ స్ర్కీన్, ఆఫ్ స్ర్కీన్ లో ఎంతో మందిని ఆదుకున్నారు. తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ అదే క్రేజుతో దూసుకుపోతున్నారు. చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ఎంతోమందికి ఆయనే ఇన్స్ స్ప్రేషన్. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి అనుకోకుండా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందట. గతంలో చిరు మోకాలు నొప్పితో కారణంగా సర్జరీ చేయించుకోవడానికి అమెరికా వెళ్లి వచ్చాడంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మళ్లీ నొప్పి తిరగబెట్టడంతో ఆపరేషన్ తప్పనిసరి అని తెలుస్తోంది. అందుకు మెగాస్టార్ మోకాలు ఆపరేషన్ కోసం ఈ వారం ఢిల్లీ లేదా బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని వినికిడి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోవాలని తెలుస్తుంది. అయితే ఈ నెలాఖరు వరకు చిరంజీవి హైదరాబాదులో ఉండడట. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. మెగా అభిమానులు కాస్తంత ఆందోళన చెందుతున్నారు. చిరంజీవి తాజాగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి.