Chiranjeevi: చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం కోట్లాది మంది ఆరాధ్య దైవం మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ప్రజెంట్ జనరేషన్ కు ఆయనొక ఇన్స్ పిరేషన్. ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లకు ఆయనొక గురువు. చిరంజీవి కేవలం వెండితెరపైనే కాదు రియల్ గా కూడా హీరో అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారు. ఇక కరోనా లాంటి విపత్తుల సమయంలోనూ సినీ కార్మికులకు, అభిమానులకు తానున్నానంటూ అండగా నిలిచారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
అసలు మేటర్ లోకి వెళితే.. ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. మెడికల్ టెస్టులు చేయించుకోగా గుండెలో 80 శాతం బ్లాకులు ఉన్నట్లు తేలింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యాంజియో గ్రామ్ చేసి బైపాస్ చేయాలని చెప్పారట. ఈ విషయమై జర్నలిస్ట్ ప్రభు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించగా.. వెంటనే స్పందించిన ఆయన తనకు బాగా పరిచయమున్న స్టార్ హాస్పటల్ డాక్టర్లకు ఫోన్ చేసి ప్రభుని అడ్మిట్ చేయించారట. ఆ హాస్పిటల్ డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాల్సిన పని లేకుండా.. కేవలం స్టంట్స్ వేసి సమస్యను క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. చికిత్స విషయంలో జర్నలిస్టు ప్రభుని హాస్పటల్‌లో ఒక్క రూపాయి కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్నారట మెగాస్టార్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో దట్ ఈజ్ చిరంజీవి అంటూ కామెంట్లు పెడుతున్నారు మెగాభిమానులు. ఎంతైనా బాస్ గ్రేట్ అంటున్నారు.