Chiranjeevi : ట్రెండ్ కి తగ్గట్టుగా తనని తాను మార్చుకోవడం అనేది మెగాస్టార్ చిరంజీవి స్టైల్. ప్రస్తుత తరం అనుసరించే స్టైల్, పద్దతి ని చిరంజీవి బాగా గమనిస్తాడు. వాళ్లకి ఏమి చేస్తే ఇష్టమో, ఎలా ఉంటే నచ్చుతాను అనేది చిరంజీవి చేసినంత అధ్యయనం నేటి తరం స్టార్ హీరోలు కూడా చెయ్యను అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఇండస్ట్రీ లో ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా మెగాస్టార్ గా కొనసాగుతూ వచ్చాడు.

ఇప్పుడు ఆయన 70 ఏళ్లకు దగ్గర పడుతున్నాడు, ఇప్పటికీ కూడా ఆయనలో ఉన్న లక్షణం పోలేదు. అందుకే ఆయనకి నేటి జనరేషన్ స్టార్ హీరోలకు కూడా లేనటువంటి అత్యధిక వంద కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇకపోతే సినిమా థియేటర్స్ కి సమాంతరం గా ఓటీటీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందిన సంగతి మన అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు లాక్ డౌన్ సమయం లో జనాలు ఓటీటీ ని బాగా అలవాటు చేసుకున్నారు.

అలా అలవాటు పడిన ఓటీటీ ఆడియన్స్ సినిమా థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే, ఓటీటీ లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే మేకర్స్ కూడా ప్రత్యేకంగా స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ లు , ఓటీటీ సినిమాలు చెయ్యించుకుంటున్నారు. అయితే అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఒక రూమర్ తెగ ప్రచారం అవుతుంది.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం సినిమాల మీదనే నా ద్రుష్టి ఉంది. విశ్వంభర చిత్రం షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను. ఈ సినిమా పూర్తి అయ్యేవరకు వేరే సినిమా ఆలోచన లేదు. అలాగే సోషల్ మీడియా లో వినిపిస్తున్నట్టుగా నేను వెబ్ సిరీస్ చేయబోతున్నాను అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు’ అని చెప్పుకొచ్చాడు.
