ప్రతీ డైరెక్టర్ కెరీర్ లో ఎదో ఒక సూపర్ హిట్ సినిమా కచ్చితంగా ఉంటుంది. కెరీర్ మొత్తం ఫ్లాప్ సినిమాలు ఏ డైరెక్టర్ కి కూడా లేదు. కానీ మెహర్ రమేష్ మాత్రం ఇందుకు అతీతుడు. ఇతను తీసిన కళాకండాలు చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోతాది. ప్రతీ సినిమా కూడా ఒక దానిని మించి చెత్తగా తీసి డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకోవడం ఈయనకి అలవాటు. ప్రభాస్ ‘బిల్లా’ సినిమాతో ఇతను కెరీర్ ప్రారంభం అయ్యింది.

ఆ తర్వాత ‘కంత్రి’, ‘శక్తి’, ‘షాడో’, అలాగే రీసెంట్ గా ‘భోళా శంకర్’ ఇలా ఫ్లాపుల మీద ఫ్లాపులు కొడుతూ దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. కానీ మన మెహర్ అన్న చిరంజీవి తో తీసిన లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ మాత్రం కేవలం 27 కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇంత అవమానకరమైన డిజాస్టర్ ఫ్లాప్ మరొకటి లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా ప్రాంతాలలో అప్పుడెప్పుడో చిరంజీవి డిజాస్టర్ ఫ్లాప్ చిత్రం ‘మృగ రాజు’ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ ఘనత ఆ మహానుభావుడు మెహర్ రమేష్ కి మాత్రమే సొంతం. ప్లాన్ చేసుకొని తీసిన చిరంజీవి ఇలాంటి ఫ్లాప్ సినిమాని మళ్ళీ తియ్యలేడు. కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా మెహర్ ని చూసి పారిపోతున్న ఈ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరి అవకాశం ఇవ్వడానికి కారణం అతను తన సొంత బంధువు అనే.

ఇప్పుడు ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినా కూడా చిరంజీవి మెహర్ రమేష్ కి మరో అవకాశం ఇచ్చాడట. ఇది ఆయన సినిమాకి కాదులెండి, ఆయన కూతురు సుస్మిత గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంస్థ లో చిరంజీవి మెహర్ రమేష్ కి ఒక చిన్న బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడట. బడ్జెట్ నాలుగు కోట్ల రూపాయలకు మించి ఉండకూడదు అని షరతు పెట్టాడట. కనీసం ఈ అవకాశం ని అయినా మెహర్ రమేష్ ఉపయోగించుకుంటాడో లేదో చూడాలి.
