మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభం లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి అభిమానుల్లో ఎలాంటి జోష్ ని అయితే నింపాడో, రీసెంట్ గా విడుదలైన ‘భోళా శంకర్’ సినిమాతో అదే రేంజ్ లో నిరాశపరిచాడు. ఈ సినిమా మొదటి రోజు తర్వాత కనీస స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ ఏడాది అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా ఎలా అయితే నిల్చిందో, ‘భోళా శంకర్’ చిత్రం కూడా అదే రేంజ్ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాగా నిల్చింది.

మెగా ఫ్యాన్స్ మొత్తం తీవ్రమైన నిరాశలో ఉన్నారు, చిరంజీవి కెరీర్ లోనే ఇది వరకు ఎప్పుడూ చూడని ఫ్లాప్ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే క్రింద పడిన ప్రతీసారీ రెట్టింపు ఉత్సాహం తో పని చేసి బౌన్స్ బ్యాక్ అవ్వడం మెగాస్టార్ స్టైల్. గతం లో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురు అయ్యాయి.

అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోసం సరైన కాంబినేషన్ తో మన ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలోనే సౌత్ ఇండియన్ టాప్ 5 డైరెక్టర్స్ లో ఒకరైన మురగదాస్ తో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడట. ఈరోజు మొత్తం సోషల్ మీడియా లో ఈ వార్త గురించే చర్చ నడించింది. ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.

గతం లో చిరంజీవి – మురగదాస్ కాంబినేషన్ లో స్టాలిన్ అనే చిత్రం వచ్చింది, ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఆడింది. ఆ తర్వాత చిరంజీవి తో సినిమాలు చేయలేదు, సౌత్ లో మిగతా స్టార్ హీరోలంతా కొలిసి కొన్ని చేసాడు, అవి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రం తో భోళా శంకర్ సినిమాకి చిరంజీవి ని తక్కువ చేసిన ప్రతీ ఒక్కరికి బుద్ధి చెప్తామని అంటున్నారు ఫ్యాన్స్.