Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయం కృషితో నటుడుగా అంచెలంచెలుగా ఎదిగి చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ గా ఎదిగాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి దాదాపు 40ఏళ్లుగా మెగాస్టార్ గా కొనసాగిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇటు ఇండస్ట్రీలో.. అటు బిజినెస్ లలో రాణిస్తున్నారు. వారు ఎంత బిజీగా ఉన్నా కచ్చితంగా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తారు. అప్పుడప్పుడు హాలీడే ట్రిప్స్ కి వెళ్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, చిరంజీవి తల్లి అంజనా దేవి, రామ్ చరణ్ భార్య ఉపాసన కలిసి ఇటీవల అత్తమ్మాస్ కిచెన్ అని ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన విషయం విదితమే. దానికి ప్రమోషన్స్ కూడా అందరూ కలిసి యాక్టివ్ గా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో సురేఖ, ఉపాసన, చిరంజీవి తల్లి అంజనా దేవి.. ఇలా అందరూ భాగస్వామ్యులు అవుతున్నారు.
ప్రస్తుతం ఎండాకాలం మొదలైంది. సమ్మర్ అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది మామిడి పళ్లు. దాంతో పాటు ప్రతి ఒక్కరు కొత్త ఆవకాశ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. చిరంజీవి ఫ్యామిలీ కూడా ఆవకాయ ఆవురావురుమంటూ ఆరగించాల్సిందే. తాజాగా ఉపాసన ‘అత్తమ్మాస్ కిచెన్’ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి భార్య సురేఖ ఇంట్లోకి, అత్తమ్మస్ కిచెన్ కి కలిపి స్పెషల్ గా ఆవకాయ పచ్చడి దగ్గరుండి చేయించింది. ఆ తర్వాత ఆవకాయ అన్నంలో కలిపి అక్కడ ఉన్న వారందరికీ రుచి చూపించారు. చిరంజీవి తల్లి సురేఖ ఆవకాయ పచ్చడి చాలా బాగా చేసిందంటూ మెచ్చుకున్నారు.
తర్వాత ఉపాసన.. అత్తమ్మ ఎక్కడికి వెళ్తున్నారంటూ సురేఖని అడుగుతుంది.. దుబాయ్ వెళ్తున్నాను, మీ మామయ్య తీసుకెళ్తున్నారు. కష్టపడి ఆవకాయ పచ్చడి చేసినందుకు, మిగిలిన పనుల్లో బాగా కష్టపడుతున్నందుకు హాలిడే ట్రిప్ కి వెళ్తున్నామని తెలిపింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక పలువురు నెటిజన్లు కష్టపడి ఆవకాయ చేసింనందుకు దుబాయ్ ట్రిప్ కి వెళ్తున్నారా అంటూ అవక్కవుతున్నారు. మరికొంతమంది మాకు కూడా ఆవకాయ పచ్చడి తినాలని ఉందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి, సురేఖ దుబాయ్ ట్రిప్ కి వెళ్తుండటంతో కొన్ని రోజులు.. విశ్వంభర సినిమా షూటింగ్ కు బ్రేక్ పడనుంది. ఈ మధ్యే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ సెట్ లో దాదాపు 26 రోజుల పాటు షూట్ నిర్వహించారు.
View this post on Instagram