MS నారాయణ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్నంత కమెడియన్స్ ప్రపంచం లో ఉన్న ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండరు అని అందరూ అంటూ ఉంటారు.కేవలం ముఖకవలికలతోనే హాస్యాన్ని పండించగల మహానటులు ఎంతో మంది ఉన్నారు. మనం ఉంటున్న జనరేషన్ లో కామెడీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు బ్రహ్మానందం మరియు MS నారాయణ.కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఏం ఎస్ నారాయణ మన అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. 2015 వ సంవత్సరం లో ఆయన కన్ను మూసారు.
మోహన్ బాబు హీరో గా నటించిన ‘పెదరాయుడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన MS నారాయణ, 23 సంవత్సరాలలో దాదాపుగా 750 చిత్రాలలో నటించాడు.ఆయన చనిపోయే ముందు వరకు కూడా మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గానే కొనసాగాడు.ఏడాదికి ఆయన 30 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఆయన చనిపోయిన సంవత్సరం లో కూడా ఆయన నటించిన 11 సినిమాలు విడుదల అయ్యాయి.
ఇది ఇలా ఉండగా MS నారాయణ ఎక్కువగా తాగుపోతూ క్యారెక్టర్స్ తో పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన పలు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఇదే అంశం గురించి అడగగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘అప్పట్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం లో నాగబాబు హీరో గా రుక్మిణీ అనే చిత్రం వచ్చింది.ఇందులో నేను నాగబాబు అసిస్టెంట్ గా తాగుబోతు లాగ కనిపిస్తాను.నేను అప్పటి వరకు తాగుబోతు పాత్రలు చెయ్యలేదు, నన్ను ప్రోత్సహిస్తూ ఆ పాత్ర ని అలవోకగా చేసేందుకు నాగబాబు ఎంతో సపోర్టు ఇచ్చాడు.ఆయన వల్లే నేను తాగుబోతు పాత్రలను అలవాటు చేసుకున్నాను. నేను తాగినప్పుడు మాట్లాడే యాస ప్రేక్షకుల చేత నవ్వు రప్పించేది, అందుకే డైరెక్టర్స్ ఎక్కువగా నాకు ఆ పాత్రలు రాసారు’ అంటూ చెప్పుకొచ్చాడు MS నారాయణ.ఆయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు, ఒక గొప్ప రచయితా మరియు దర్శకుడు కూడా, అలాంటి లెజెండ్ ఈరోజు మన మధ్య లేకపోవడం తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం.