Niharika : అతడితో మెగా డాటర్ నిహారిక మినీ డేట్.. ముద్దులు పెడుతున్న వీడియో వైరల్

- Advertisement -

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో యాంకర్‎గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆమె కెరీర్ కు ఉపయోగపడే సక్సెస్ అందుకోలేకపోయింది. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే నిహారిక భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.

అతనితో డివోర్స్ తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు. డివోర్స్ విషయంలో నిహారికదే తప్పంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు పట్టుకున్న పాపాన పోలేదు. ఓ యూట్యూబ్‌లో ఛానెల్‌లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -

naga babu niharika

నిహారిక ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌ ఎంజాయ్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సొంత నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి సినిమాలకు తెరకెక్కిస్తూనే హీరోయిన్‌గా ఓ మూవీ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటూ రోజుకో పోస్ట్ అయినా పెడుతుంది. నిహారిక పెట్టే పోస్టులు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా, నిహారిక తన తండ్రి మెగా బ్రదర్ నాగబాబుతో మినీ డేట్‌కి వెళ్లింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఓ క్యూట్ వీడియో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రికి ముద్దులు పెడుతూ తన ప్రేమను కురిపించింది. అయితే నిహారికకు నాగబాబు అంటే చాలా ఇష్టం. ఈ వీడియోను షేర్ చేస్తూ మరోసారి తన ప్రేమను వ్యక్త పరిచింది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here