బాలీ వెకేషన్‌లో మెగా డాటర్ నిహారిక.. బోల్డ్ ఔట్‌ఫిట్స్‌లో అంతా చూపించేస్తోందిగా

- Advertisement -

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీ ఐలండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి నిహారిక ఈ వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ బీచుల్లో సందడి చేస్తూ.. రిసార్ట్‌లో సేద తీరుతూ హాయిగా జాలీగా గడుపుతోంది. తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే నిహారిక తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్యాక్ చూపిస్తూ దిగిన ఈ ఫొటోల్లో నిహారిక ట్రెండీగా కనిపించింది. మైండింగ్ మై బిజినెస్ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది ఈ బ్యూటీ

నిహారిక
నిహారిక

ఈ ఔట్‌ఫిట్‌లో నిహారిక సూపర్ కూల్‌గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ డ్రెస్సులో షోల్డర్స్ చూపిస్తూ.. బ్యాక్ ఎక్స్‌పోజ్ చేస్తూ నిహారిక నాటీ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. నిహారిక రాన్రాను చాలా బోల్డ్‌గా తయారవుతోందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో లైఫ్ అంటే నిహాదే.. సూపర్‌గా ఎంజాయ్ చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం నిహారిక ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

టాలీవుడ్‌ను శాసించే మెగా కాంపౌండ్ నుంచి అడుగుపెట్టినా.. నిహారిక తన కెరీర్‌ను మాత్రం బుల్లితెరపై నుంచే షురూ చేసింది. ఈటీవీలో ఢీ జూనియర్స్ షోకు యాంకర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి అంటూ వెబ్ సిరీస్‌లతో యూత్‌ను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఒక మనసు మూవీతో అరంగేట్రం చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.

- Advertisement -

ఒక మనసు డిజాస్టర్ తర్వాత నిహారిక.. సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో సందడి చేసింది. ఆ సినిమాలు కూడా అనుకున్నంతగా ఆడలేదు. తమిళ్‌లోనూ ఓ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇక సినిమాలు చేయడం ఆపేసింది. తన ఫోకస్ అంతా నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్స్‌పై పెట్టింది. ప్రొడ్యూసింగ్‌లో మాత్రం నిహారిక తన టేస్ట్‌తో సత్తా చాటుతోంది. మంచి మంచి వెబ్ సిరీస్‌లు చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ డెడ్ పిక్సెల్ అనే గేమింగ్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here