Lavanya Tripathi : అందం తో పాటు చక్కటి నటన కనబర్చే అతి తక్కువమంది టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరు లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె, మొదటి నుండి నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ వచ్చింది. ఇకపోతే రీసెంట్ గానే ఆమె వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందో లేదో అని ఆమె అభిమానులు అనుకున్నారు.

కానీ ఆమె పెళ్ళైన రెండు నెలల లోపే ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది. డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నుండి కూడా ఆమె ఇలాంటి నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తాను అంటూ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈమెకి సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

అదేమిటంటే రీసెంట్ గానే ఈమె ఒక స్టార్ హీరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కాని హీరోయిన్ గా కాదనీ, ఆ హీరో కి తల్లిగా నటించబోతుంది అని ఒక వార్త నిన్నటి నుండి తెగ ప్రచారం అవుతుంది. కానీ ఆమె పోషించే ఆ తల్లి పాత్ర హీరో చిన్నతనం లో ఉన్నప్పటిది అని అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి, హీరో , డైరెక్టర్స్ ఎవరు అనేది అతి త్వరలోనే అధికారిక ప్రకటన చెయ్యబోతున్నారు.

ఈ సినిమాతో పాటుగా ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ లో మెయిన్ లీడ్ గా నటించబోతుందని తెలుస్తుంది. ఇక నుండి అన్నీ ఇలాంటి పాత్రలే చేస్తానని, అలాంటి పాత్రలే వస్తున్నాయి అంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో వరుణ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తారా అని మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కచ్చితంగా చేస్తాను అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.