Sai Dharam Tej : ‘మెగా’ కాంట్రవర్సీ.. ఈ సుప్రీం హీరోను వివాదాలు అసలు వదలట్లేదుగా..?

- Advertisement -

Sai Dharam Tej : టాలీవుడ్​ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ గురించి తప్పక ప్రస్తావన వస్తుంది. ఈ కాంపౌండ్ నుంచి ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు ప్రొడ్యూస్ అయ్యారు. అందులో దాదాపు అందరూ మంచిస్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వాళ్లు గ్లోబల్, పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. మంచి స్క్రిప్టులను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక పోతే అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్ మాత్రం ఇంకా స్థిరపడలేదనే చెప్పుకోవాలి. అయితే మెగా ఫ్యామిలీకి వివాదాలు కొత్తేం కాదు.

sai dharam tej
sai dharam tej

ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్లలో పలువురిపై వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్​ ఇటీవల వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటున్నాడు. గతంలో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ ప్రమాదం నుంచి కోలుకుని విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ ప్రమాదం.. తాగి డ్రైవ్ చేయడం వల్లే జరిగిందని అప్పట్లో మీడియా తెగ గొడవ చేసింది. కొన్నాళ్ల తర్వాత అదంతా సద్దుమణిగింది. అయితే తాజాగా సాయి ధరమ్.. మరో వివాదంలో చిక్కుకున్నాడు.

సాయి ధరమ్ తేజ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో కలిసి బ్రో మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్​గా నటించారు. జులై 28న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తేజ్ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నాడు. తాజాగా శ్రీకాళహస్తి వెళ్లి సుబ్రమణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించాడు. అయితే గర్భగుడిలో తేజ్ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

- Advertisement -
sai dharam tej bro movie

సాయి ధరమ్ ఆలయంలోకి వెళ్లే సమయానికి గర్భగుడిలో అర్చకులు లేరు. దీంతో ఆయన స్వయంగా దేవుడికి హారతి ఇచ్చాడు. దీన్ని హిందూ వర్గాలు తప్పుబడుతున్నాయి. గర్భగుడిలో అర్చకులు మాత్రమే దేవుడికి హారతి ఇవ్వాలనియ. సాయి ధరమ్ తేజ్ హారతి ఎలా ఇస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలియక చేసిన పనికి సాయి ధరమ్ తేజ్ విమర్శలపాలవుతున్నాడు.

అయితే తేజ్ ఫ్యాన్స్ మాత్రం.. ఇది భూతద్దంలో పెట్టి చూడాల్సినంత పెద్ద తప్పేం కాదని.. సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. కొందరు తేజ్​కు నెగిటివ్​గా వాదిస్తుంటే.. తేజ్ ఫ్యాన్స్ మాత్రం తనకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ టైం అసలు బాగుండటం లేదని కొందరు అంటున్నారు. తరచూ వివాదాలు ఈ మెగా హీరోను చుట్టుముడుతున్నాయంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here