ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉంటారు. మీట్‌ని రోజూ తమ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు నాన్‌వెజ్ ప్రియులు. పుట్టినప్పటి నుంచి నాన్‌వెజ్ తిననివాళ్లు ఉంటారు. కానీ మధ్య వయసులో మాంసాహారాన్ని విరమించుకుంటున్నారు కొంతమంది. సెలబ్రెటీలు, స్టార్ ఆటగాళ్లు సైతం ఈ జాబితాలో ఉన్నారు. అయితే వారు నాన్‌వెజ్ మానేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తాను నాన్‌వెజ్ మానేయడానికి గల కారణాలను చెప్పారు.

ఒకసారి నాకు తీవ్రమైన జ్వరం వచ్చిందని, దానివల్ల ఊపిరి తిత్తుల సమస్యలు తలెత్తేవని నాగబాబు చెప్పారు. ఆ మధ్య కాలంలో నాకు గొంతు బాగా చెడిపోవడాన్నిజనాలు గమనించే ఉంటారని గుర్తుచేశారు. అప్పటి నుండి తన ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నట్లు తెలిపారు. చిన్న చిన్న చెడు అలవాట్లు ఉండేవని, అవి కూడా మానేశానని నాగబాబు చెప్పారు. గతంలో నాన్ వెజ్ ఒక రేంజ్‌లో తినేవాడినని చెప్పిన ఆయన ఇప్పుడు అసలు తినటం లేదని చెప్పారు.
నాన్‌వెజ్ తినాలంటే ఒక ప్రాణిని హింస పెట్టి , చంపి తినడం తనకు చాలా బాధ అనిపించిందని, ఈ విషయం మొదటి నుండి తన మైండ్‌లో బలమైన అసంతృప్తిగా ఉండేదని చెప్పారు. ఒక రోజు నాన్ వెజ్ మానేయాలి అనుకున్న ఆయన ఆ వెంటనే మానేసినట్లు చెప్పారు. ఇక పాలు, పెరుగు తినడం కూడా మహాపాపమని ఆయన భావించారట. ప్రస్తుతం మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవడం లేదని తెలిపారు. కేవలం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ ని తింటూ బ్రతుకుతున్నానని చెప్పుకొచ్చారు నాగబాబు.

మెుక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది. మరి అది హింస కాదా? అనొచ్చు. అవి తినకపోతే సచ్చిపోతాం. బీపీ.. షుగర్ ఉన్నాయి. రెగ్యులర్ ఎక్సర్ సైజుల ద్వారా వాటిని నియంత్రిస్తున్నానని చెన్నారు. బిజినెస్ లైఫ్‌లో పడి కొన్ని ఎంజాయ్ మెంట్‌లు మానేశానని చెప్పారు. అలాగే కొత్త ప్రదేశాలు.. కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఈసారి వాటిపైనా ఫోకస్ చేయాలంటూ తన అభిరుచులను పంచుకున్నారు.