Tarun : టాలీవుడ్ హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటి రోజా రమణి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి చిన్న తనంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా తల్లి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో కొన్నేళ్లు తన హవా కొనసాగించాడు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిసినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తర్వాత నువ్వే నువ్వే, సోగ్గాడు, నవ వసంతం, ఎలా చెప్పను వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కానీ తరుణ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఆయన పెళ్లి గురించి ఎన్ని వార్తలు వచ్చినా స్పందించకుండా.. సోషల్ మీడియాకు తరుణ్ దూరంగా ఉంటున్నాడు. దానికి కారణాలు తెలియనప్పటికీ ఆయన పెళ్లి వార్తలపై తరుణ్ తల్లి నటి రోజా రమణి ఇప్పటికే పలుమార్లు స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణి తరుణ్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట్లో చర్చనీయాంశంగా మారాయి. ‘‘రూమర్స్ ఆ పదం లోనే ఉంది కదా అవి నిజం కావని. అందుకే వాటిని పట్టించుకోవద్దు. సీరియస్‌గా అస్సలే తీసుకోవద్దు. నవ్వుకుని వదిలేయాలి. చెప్పుకోనివ్వండి.. మాట్లాడుకోనివ్వండి.. అలా చేస్తే వారికి వచ్చేది ఏం లేదు. ఇక తరుణ్ సినిమాల్లో చేసుకున్న పెళ్లిళ్ల కంటే బయటనే వాడికి ఎక్కువ అవుతాయి.
ఇప్పటికే తరుణ్‌కు మూడుసార్లు పెళ్లి జరిగిపోయింది. ఎవరిదో ఫొటో తీసుకుని, దానికి వేరే తల పెట్టడమో లేదంటే ముఖాలు బ్లర్ చేయడం వంటివి చేసి పెట్టేస్తుంటారు. ఆ ఫొటో తాలూకు హీరోయిన్లు నాకు ఫోన్లు చేసి ఆంటీ ఫొటో చూశారా? పెళ్లి చేశారని చెప్తుంటారు. శ్రియ, త్రిష, ప్రియమణి వాళ్లంతా చాలా క్లోజ్‌గా ఉంటారు. కాబట్టి నాకు ఫోన్ చేసి ఆట పట్టిస్తుంటారు. నేను కూడా వాటిని సీరియస్ తీసుకోను. తల్లిగా తరుణ్ పెళ్లి చేయడం నా బాధ్యత. కానీ వాడికి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే చేస్తాను. అది లవ్ మ్యారేజా? పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది వాడి చేతిలోనే ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు 41 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి ఏదో కారణం ఖచ్చితంగా ఉందంటూ పలురకాలుగా చర్చిస్తున్నారు.