Mohan Babu : మీ వల్లే నా కొడుకు బతికాడు.. మంచు విష్ణు ఆరోగ్యంపై మెహన్ బాబు అప్ డేట్..

- Advertisement -

Mohan Babu : ‘కన్నప్ప’ మంచు విష్ణు, మోహన్ బాబుల డ్రీం ప్రాజెక్ట్. ఎన్నాళ్లుగానో ఈ కథ మీద వర్క్ చేసిన విష్ణు.. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని పట్టలెక్కించారు. భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం అంతా కలిసి న్యూజిలాండ్‌ వెళ్ళారు. ఇందులో భాగంగా డ్రోన్ సహాయంతో ఓ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా.. డ్రోన్‌ అదుపు తప్పి విష్ణు మీదకు రావడంతో అతని చేతికి దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం విష్ణు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

Mohan Babu
Mohan Babu

ఈ నేపథ్యంలోనే మోహన్‌ బాబు కుమారుడి హెల్త్‌ గురించి అప్డేట్ ఇవ్వడంతో మంచు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మంచు విష్ణు ఇటీవల షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ సినిమా చిత్రీకరణ సమయంలో విష్ణుకు ప్రమాదం జరిగిందని, యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అతని చేతికి తీవ్ర గాయాలయ్యాయని, దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారని ప్రచారం జరిగింది. విష్ణుకు ఏమైందో అని మంచు అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో విష్ణు ఆరోగ్యంపై స్పందించారు.

మంచు మోహన్ బాబు బుధవారం ట్విట్టర్ వేదికగా విష్ణు హెల్త్ అప్డేట్ అందించారు. దేవుడి దయవల్ల తన కుమారుడు కోలుకుంటున్నాడనే గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు. ”న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ సెట్‌లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, సపోర్ట్ కు ధన్యవాదాలు. భగవంతుని దయతో అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్‌ లో పాల్గొంటాడు. హర హర మహాదేవ్!” అని మోహన్ బాబు తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here