Manchu Vishnu : భార్య కోసం మంచు విష్ణు ఇంత చేశాడా.. ప్రేమంటే ఇదేరా అంటోన్న నెటిజన్లు..

- Advertisement -

Manchu Vishnu ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌ ఎక్కువ భాగం న్యూజిలాండ్‌ లోనే జరుగుతోంది. దీంతో ఎక్కువగా అక్కడే ఉంటున్నాడు మంచు విష్ణు. ప్రస్తుతం కన్నప్ప సెకెండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఇదిలా ఉంటే శుక్రవారం (మార్చి 1) మంచు విష్ణు- విరానికల వెడ్డింగ్ యానివర్సరీ. ఈ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అవుతోంది. ఈ స్పెషల్ డేను పురస్కరించుకుని తన భార్యకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు హీరో మంచు విష్ణు.

తన భార్యను కూడా న్యూజిలాండ్ తీసుకెళ్లిన మంచువారబ్బాయి అక్కడ హెలికాప్టర్ ఎక్కించి న్యూజిలాండ్ ప్రకృతి అందాలను చూపించాడు. హెలికాప్టర్ ఎక్కాక తన సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. విష్ణు ఊహించని సర్‌ప్రైజ్‌కు ఆశ్చర్యపోయిన విరానికా భర్తకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుంది విరానికా.

‘ఇలాంటి అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్‌. అస్సలు ఊహించలేదు. ఇవన్నీ బాగా ప్లాన్ చేశావు. నీతి ప్రతిరోజు ఒక అడ్వెంచర్ లా ఉంటుంది. హ్యాపీ 15 మై లవ్‌’ అంటూ తన భర్తకు విషెస్ చెప్పింది విరానిక. ప్రస్తుతం మంచు విష్ణు, విరానికల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు విష్ణు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విష్ణు, వెరానికలు 2009 మార్చి1న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ దాంపత్య బంధానికి ప్రతీకగా అరియానా, వివియానా, ఐరా, అర్వం అనే నలుగురు పిల్లలు ఉన్నారు ఈ క్యూట్ కపుల్‌కి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here