Manchu Vishnu : నటుడు మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. రగిలే గుండులు సినిమాతో తొలిసారి బాలనటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2003లో వచ్చిన విష్ణు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాతో అవార్డు కూడా అందుకున్న విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించాడు. అలాగే మోహన్ బాబు నిర్మించిన మోహన్ బాబు కార్పొరేషన్ సీఈవోగా కూడా విష్ణు వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ రోజు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణుకి విషెస్ తెలియజేస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా రూపొందిన మంచు విష్ణు గత చిత్రం జిన్నా.. టాక్ పరంగా ఆకట్టుకుంది. ఇప్పుడు కన్నప్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కూడా మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో కూడా జరుగుతోంది.

కన్నప్ప సినిమాలో పలువురు ప్రముఖులు కూడా నటిస్తున్నారు. తాజాగా కన్నప్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనుండగా, నయనతార పార్వతి దేవిగా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.