Manchu Manoj : సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ బిజినెస్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

మంచు మనోజ్,భూమా మౌనిక కలిసి ఓ బిజినెస్ మొదలు పెట్టనున్నారు. క్రిస్మస్ సందర్భంగా తమ కొత్త బిజినెస్ గురించి తెలిపారు ఈ స్టార్ జంట. నమస్తే వరల్డ్ అనే బొమ్మల షాపును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బొమ్మల షాపు ను అతి త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో నమస్తే వరల్డ్ పేరిట ఈ బొమ్మల షాప్ ను ప్రారంభించనున్నారట. ఈ బొమ్మలన్నీ ఇండియాలో తయారు చేసినవే అని తెలిపారు. ఈ షాపులో ఒక్కో ప్రాంతంలో బాగా ఫెమస్ బొమ్మలను కలెక్ట్ చేసుకున్నట్లు మనోజ్ చెప్తున్నాడు.

సలార్, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, రోబో.. అలాగే త్వరలో రిలీజ్ కానున్న ఈగల్, హనుమాన్ లాంటి ల్లో సూపర్ హీరోలు ఉన్నారు. ఆ పాత్రలతో గేమ్స్ ను డిజైన్ చేస్తాం అని అన్నారు. ఆ సూపర్ హీరోల పాత్రలను కార్టూన్స్‌గా, బొమ్మలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం అని తెలిపారు. అలాగే సీక్రెట్ గా మా ఇంట్లోనే ఆఫీస్ గా మార్చుకొని పని చేస్తున్నాం అని తెలిపారు. మేము చేస్తున్న కొత్త ప్రయత్నం అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు మనోజ్. ఇందుకు సంబందించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.