Manchu Manoj : మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ కొద్ది రోజుల క్రితమే భూమా మౌనిక రెడ్డి ని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం మనోజ్ కి మాత్రమే కాదు, మౌనిక కి కూడా ఇది రెండవ పెళ్లి.గతం లో గణేష్ రెడ్డి అనే అతనిని పెళ్ళాడి, రెండేళ్ల క్రితమే విడాకులు కూడా తీసుకుంది. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, మౌనిక ని మనోజ్ ఎంతలా అయితే ప్రేమించాడో, ఆమె కొడుకుని కూడా అంతే ఇష్టపడ్డాడు.
తన కొడుకు మీద మనోజ్ చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు నచ్చే మౌనిక మనోజ్ ని ఇష్టపడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్.అంతే కాదు మనోజ్ తన పేరు మీదున్న కొన్ని ఆస్తులను కూడా ఆ అబ్బాయి పేరిట మార్చాడట.అతనికి భవిష్యత్తులో ఎలాంటి లోటు కలగకుండా బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసాడట.వేరే వాళ్లకి పుట్టిన పిల్లలను దగ్గరకి కూడా తియ్యని తండ్రులు ఉన్న ఈరోజుల్లో, మనోజ్ ఆ అబ్బాయి మీద చూపిస్తున్న ప్రేమని చూసి నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మనోజ్ పెళ్లి తర్వాత నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.బయటకి వస్తున్నా సమయం లో ఆయన మీడియా తో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మౌనిక నా జీవితంలోకి రావడాన్ని ఆ దేవుడు నాకిచ్చిన వరం లాగ భావిస్తున్నాను. స్వచ్ఛమైన ప్రేమకి ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం వరించక తప్పదు. మా ఇద్దరి విషయం లో కూడా అదే అయ్యింది, ఇక మా జీవితంలో ఆ బాబు కూడా ఈశ్వర ప్రసాదం గానే భావిస్తాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని పెద్దలు అంటూ ఉంటారు కదా, నా విషయం లో ఆ సామెత సరిగ్గా సరిపోతుంది’ అంటూ మనోజ్ ఈ సందర్భంగా మాట్లాడాడు.
ఇక మనోజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత ఆయన ఎలాంటి చిత్రంలోనూ నటించలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో పాటుగా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన లైనప్ లో పెట్టుకున్నాడట. ఇక నుండి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.