Manchu Manoj : ఈరోజు ఉదయం ఇంటర్నెట్ ఓపెన్ చెయ్యగానే మన అందరిని షాక్ కి గురి చేసిన అంశం మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య గొడవ.వీళ్లిద్దరి మధ్య గత కొంతకాలం నుండి సఖ్యత లేదు అంటూ సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు వచ్చాయి కానీ, అవి కేవలం రూమర్స్ మాత్రమే అని అందరు అనుకున్నారు.కానీ నేడు మంచు విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లి తేల్చుకుందాం రారా అన్నట్టు గొడవలు పడుతున్న వీడియో ని మనోజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.
ఆయన ఈ వీడియో పెట్టిన నిమిషాల వ్యవధి లోనే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో సర్క్యూలేట్ అయిపోయింది. అయితే మోహన్ బాబు మనోజ్ కి ఫోన్ చేసి బాగా తిట్టడం తో ఆయన వెంటనే ఆ వీడియో డిలీట్ చేసాడు.ఒకప్పుడు పాలు నీళ్లు లాగ కలిసి ఉండే మంచు మనోజ్ – విష్ణు మధ్య గొడవలు రావడానికి కారణం గా ఏమిటి..?
సోషల్ మీడియా లో తన అన్నయ్య మీద నెగటివ్ గా పోస్టు వేసే రేంజ్ కి ఈ గొడవ వెళ్ళింది అంటే , అందుకు కారణం ఏమిటి అనే విషయాన్నీ పరిశీలిస్తే భూమా మౌనిక రెడ్డి వల్లే ఇదంతా జరిగింది అనే విషయం తెలుస్తుంది.గత కొద్దిరోజుల క్రితమే మనోజ్ కి భూమా మౌనిక రెడ్డి కి పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరికీ ఇది రెండవ పెళ్లే, అయితే ఇది నిన్న మొన్న అనుకోని చేసుకున్న పెళ్లి కాదు.
మూడేళ్ళ నుండి వీళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తుంది, అది ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు, ముఖ్యంగా విష్ణు కి.ఎందుకంటే ఆమె తో ఒకసారి మాటామాటా పెరిగి గొడవైందట, మనోజ్ కూడా గొడవ పెట్టుకొని ఇంటి నుండి వేరు అయ్యిపోయాడట.మూడేళ్ళ నుండి మౌనిక తో కలిసి ఒక ప్రత్యేకమైన ఇంట్లో సహజీవనం చేస్తున్నాడు మనోజ్.అలా వాళ్ళ మధ్య ఏర్పడిన ఈ గొడవ పెరుగుతూ పెరుగుతూ నేడు కొట్టుకునే స్థాయికి చేరింది.