Manchu Manoj : తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మంచు మనోజ్ మీడియా వాళ్లతో ఆటలాడుకుంటూ జోకులు వేస్తున్నారు. ఆమధ్య ఒక వీడియో పోస్ట్ పెట్టిన మనోజ్ మొత్తం కుటుంబం అంతా వైరల్ అయ్యేటట్టు చేశాడు. మళ్లీ అదే మనోజ్ ఇప్పుడు ఆ విషయం గురించి అడిగితే షాకింగ్ కామెంట్లు చేయడం మరింత వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళితే మొన్నమధ్య మంచు మనోజ్ , విష్ణుల వీడియో ఒకటి నెట్టింట చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు మీడియా వాళ్ళు అదే ప్రశ్నను మంచు మనోజ్ ని అడిగితే ఆయన మాత్రం వెరైటీగా సమాధానం చెప్పాడు.

“సెగ గడ్డ వచ్చింది.. గోకుతారా” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మంచు మనోజ్ . అయితే మీడియా వాళ్ళు మాత్రం అది కాదండి.. రీసెంట్గా ఇష్యూ జరిగింది కదా దానిమీద మాట్లాడమని అడిగితే.. ఇదే రీసెంట్ ఇష్యూ అని తన భుజం చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇకపోతే మంచు మనోజ్ గత వారం రోజుల క్రితం తన అన్నయ్య మంచు విష్ణు సారధిని కొట్టడానికి వస్తున్నాడు అంటూ ఆ వీడియో అని నెట్టింట షేర్ చేసిన విషయం తెలిసిందే. అది కాస్త ఒక సంచలనం సృష్టించింది.
అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉన్నట్టు కనిపించడం లేదు అని వార్తలు కూడా వైరల్ అయ్యాయి . ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నా కూడా ఎప్పుడు బయటపడలేదు.. కానీ ఈసారి మనోజ్ స్వయంగా బయట పెట్టాడు కాబట్టి ఈ వార్త పబ్లిక్ కి తెలియాలని అనుకున్నాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అది కాస్త ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది. అలా వీడియో చేసిన వారు ఇప్పుడెందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అన్నది మీడియా వాళ్ళ ప్రశ్న. మరోవైపు మంచు మనోజ్ ని అడిగితేనేమో సెగగడ్డ అంటున్నాడు ఇది చూసిన మీడియా వాళ్ళు..భయ్యా.. అడిగిందేంటి.. మధ్యలో నీ “సెగ..గడ్డ” అవసరమా.? ఏం కవరింగ్ మనోజా..
అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా మాట్లాడినావు ఏంటి మనోజ్? మీడియా తో మాట్లాడే అప్పుడు కొంచెం చూసుకోవాలి కదా #ManchuManoj pic.twitter.com/bLCeLPzCox
— Lakshmi (@Itsmelakshmi06) April 6, 2023