Pawan Kalyan : పవన్ తో ఉన్న ఫొటో షేర్ చేయొద్దని దండం పెడుతోన్న హీరోయిన్..

- Advertisement -

Pawan Kalyan : ఎన్నో సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసింది.. అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసి అందరి చేత వావ్ అనిపించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో మెరిసి తన అందంతో కుర్రాళ్లకు కిర్రెక్కించింది. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే చాలా మంది ఛాన్స్ లు రాక బాధపడుతుంటే.. ఈ అమ్మడు మాత్రం అస్సలు అలాంటి పాత్రలు ఎందుకు చేశాను అని బాధపడుతుంది. ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇంతకు ఆ భామ ఎవరు..? ఆమెకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా..? ఇంతకు ఆమె మరెవరో కాదు.. ముంతాజ్. తారీఖు, ఖుషి, చాలాబాగుంది, జెమిని, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, పెళ్లి కాని పెళ్లాం అవుతుంది, ఆగడు, టామీలాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాలో స్పెషల్ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ చేసింది. అదేవిధంగా.. అత్తారింటికి దారేది సినిమాలో సాంగ్ లో నటించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఆగదు సినిమాలో కూడా నటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఒకప్పుడు గ్లామర్‌ రోల్స్‌ చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పింది ఈ చిన్నది.

- Advertisement -

ముంతాజ్ గ్లామర్ రోల్స్ లో నటించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటీకి వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ ఫోటోలను డిలీట్ చేయాలని ఉందన్నది. తన దగ్గ బోలెడంత డబ్బుంటే వాటితో సోషల్ మీడియాలో ఉన్న తన గ్లామరస్ ఫోటోలను డిలీట్ చేస్తానని తెలిపింది. అదితన వల్ల కానీ పని అని చెప్పింది. దయచేసి నా ఫ్యాన్స్ నా గ్లామర్‌ పిక్స్‌ షేర్‌ చెయ్యొద్దు. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలు మాత్రం షేర్‌ చేయకండి అని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం.! అంటూ ముంతాజ్‌ ఎమోషనలైంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here