Mammootty : నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి మలయాళం లో మెగాస్టార్ రేంజ్ కి వెళ్లిన నటుడు మమ్మూటీ. ఈయన కేవలం మలయాళం లో మాత్రమే కాదు, మన టాలీవుడ్ లో కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. ఈయన తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా మలయాళం లో ప్రస్తుతం టాప్ స్టార్ హీరో. మలయాళం తో పాటుగా తెలుగు, హిందీ మరియు తమిళం లో కూడా ఈయనకి ప్రత్యేకంగా సూపర్ హిట్స్ ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్దమవుతాడు మమ్మూటీ. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఒక సంచలనాత్మక పాత్ర ని పోషించబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జో బేబీ దర్శకత్వం లో మమ్మూటీ మరియు జ్యోతిక హీరో హీరోయిన్లు గా ‘కాథల్’ అనే చిత్రం చేసారు. ఈ సినిమా ఈ నెల 23 వ తారీఖున విడుదల కాబోతుంది.

ఈ చిత్రం లో మమ్మూటీ గే పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఆ స్థితి లో ఉన్న వారి సిద్ధాంతాలు మరియు ఆలోచన విధానాల గురించి కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారట. లక్షలాది మంది అభిమానులు ఉన్న మమ్మూటీ లాంటి మెగాస్టార్ కూడా ఇలాంటి పాత్ర ఒప్పుకొని చెయ్యడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం మమ్మూటీ మలయాళం లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్.

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కున్నార్ స్క్వాడ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా ఓటీటీ లో కూడా విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ ‘కాథల్’ చిత్రం తో కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.