Mohan Lal – Mammootty : సాధారణంగా సినిమా హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా హీరే గొప్ప అంటూ ఇరువర్గాలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య డర్టీ వారే నడుస్తుంది. హీరోలు సఖ్యంగా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ శత్రుత్వం మెయింటైన్ చేస్తుంటారు. అయితే ఇదంతా ఇప్పుడు. గతంలో హీరోల మధ్య కానీ, హీరోల ఫ్యాన్స్ మధ్య కానీ ఇలాంటి రైవల్రీ ఉండేది కాదు. ఎంతటి స్టార్ హీరోలయినా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండేవారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండేవారు.

అలా మలయాళం సినిమా ఇండస్ట్రీలో దశాబ్ధాలుగా మూవీ లవర్స్ కు వినోదాన్ని అందిస్తున్న మిత్రధ్వయం మోహన్ లాల్, మమ్ముట్టి. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ఆరు పదుల వయసు దాటినా ఇంకా మెయిన్ లీడ్ లోనే నటిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో 50 ఏళ్లు దాటినా.. వయసుకు మించిన ఫైట్లు, కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ గట్రా ఈ హీరోలు చేయరు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు. వయసుకు తగ్గట్టుగా సినిమాల ఎంపికలో తమ పరిణతి చూపిస్తున్నారు.
60 ఏళ్లు దాటినా ఈ మిత్రధ్వయం ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఈ ఇద్దరు స్టార్లు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే అవడానికి ఇద్దరూ స్నేహితులే అయినా ఇద్దరు కలిసి కనిపించే అవకాశం చాలా తక్కువ. ఇక ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా తక్కువ ఛాన్స్.
అయితే వీళ్లిద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడమే సర్ ప్రైజింగ్ అంటే.. తాజాగా ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ తమ మధ్య ఉన్న ప్రేమను చూపించారు. ఓ స్టేజ్ పై ఈ మోహన్ లాల్ , మమ్ముట్టి ఒకే ఫ్రేమ్ లో కనిపించడమే కాదు.. ఆప్యాయంగా ఇద్దరు హగ్ చేసుకున్నారు. అంతేనా అంటే కాదు.. ఇంకా ఉంది. ప్రేమతో ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఈ సీన్ చూసేందుకు ఫ్యాన్స్ కు రెండు కళ్లు చాలడం లేదట. ఇంతకీ ఈ అరుదైన సీన్ ఎక్కడ కనిపించిందంటే.. వనిత ఫిలిం ఫేర్ అవార్డ్సు 2024 ఈవెంట్‌లో కనిపించింది. ఈ ఈవెంట్‌లో మోహన్ లాల్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ , మమ్ముట్టి ఒకరినొకరు ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ స్టార్ హీరోల అరుదైన స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
❤️🫰#Mohanlal #Mammootty pic.twitter.com/LZ0gHHljJ1
— Mohanlal Media Club (@MohanlalClub) April 23, 2024