Mamitha Baiju : సెలబ్రిటీలకు అభిమానులే బలం. కొన్ని కొన్ని సార్లు వారి అభిమానం హద్దులు మీరి పోతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు మనం చాలానే చూస్తుంటాం. అభిమానులు ఒక్కోసారి ఎలా రెచ్చిపోతారంటే ఒక హీరోయిన్ ఏదైనా ఈవెంట్ కోసం బయటకు వచ్చిన .. ఏదైనా షాప్ ఓపెనింగ్ చేసేందుకు వెళ్లినా అక్కడి కుర్రాళ్లు ఓ రేంజ్ లో అత్యుత్సాహం చూపిస్తుంటారు. ఎంతలా అంటే ఆమె ఒక హీరోయిన్ అన్న విషయం పక్కన పెడితే.. ఆమె ఓ మహిళ అన్న విషయం కూడా గుర్తించరు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ, చేతులతో నలిపేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ప్రస్తుతం అలాంటి పరిస్థితికి గురైంది మలయాళీ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ మమిత బైజు. హీరోయిన్ మమతా బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా రాజమౌళి సైతం ఆమె నటన ను ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో తెలుగులో సైతం మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ – ఎన్టీఆర్ లతో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రీసెంట్ గా ఆమె షాప్ ఓపెనింగ్ కు హాజరైంది. దీంతో మమిత బైజును చూసేందుకు భారీగా జనం గుమిగూడారు. ఆ సమయంలో అక్కడి కుర్రాళ్లు ఆమెను తెగ ఇబ్బంది పెట్టేశారు. ఆమెను సాండ్విచ్ మాదిరిగా నలిపేస్తూ తాకరానిచోట తాకుతూ.. పిండుతూ ఓ రేంజ్ లో టార్చర్ కి గురి చేశారు . దీనితో అసహనం వ్యక్తం చేసింది మమిత . దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇలా ఎందుకు చేస్తారో ఈ అభిమానులు అంటూ మండిపడిపోతున్నారు జనాలు. కొందరు మాత్రం కుర్రాళ్లు ఇలా చేయడం తప్పు అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు.