Mamitha baiju: రీసెంట్ టైమ్స్ లో మలయాళం మూవీస్ హవా నడుస్తుంది. మంజుమల్ బాయ్స్, బ్రహ్మయోగం, ప్రేమలు ఇలా చాల మూవీస్ లీస్ట్ అంచనాల మధ్యన విడుదలై, చాలా పెద్ద విజయాలు సాధించాయి. ప్రేమలు మూవీ కూడా మొదట చాలా చిన్న మూవీగా రిలీజ్ అయినా కూడా ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ఈ ప్రేమలు మూవీలో నటించిన, మమిత బైజుకు ఇప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికే చాలా తెలుగు మూవీస్ లో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు కూడా ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆమె ప్రేమలు ప్రమోషన్ ఈవెంట్స్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మమిత ఒక మలయాళం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అల్లు అర్జున్ పై తనుకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. తానూ చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ కు ఫ్యాన్ ని అని, బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ ను కాపీ కొట్టేదానినని, తానూ చిన్నప్పుడు చూసిన హ్యాపీ, బన్నీ మూవీస్ ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ విషయంపై బన్నీ ఫ్యాన్స్ చాల హ్యాపీ గా ఉన్నారు. అయితే తాజాగా ఈ ప్రేమలు తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ అయ్యింది. తెలుగు ప్రేమలు ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడుతూ తనకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని, ఇక్కడ ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరు హీరోస్ ఇష్టమని చెప్పారు. అయితే ఈ వీడియోను ప్రతి హీరో ఫ్యాన్ వాళ్లకు నచ్చినట్టు ఎడిట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, మమిత మా హీరో ఫ్యాన్ అంటూ గొడవలు పడుతున్నారు.
ఈ గొడవను చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం… మమిత ఆ హీరోకే ఫ్యాన్ అని, మిగితా హీరోస్ పేర్లు ఎదో ఫార్మాలిటీకి చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవలు ఇలా ఉండగా ప్రేమలు మూవీ తెలుగులో కూడా చాల పెద్ద హిట్ అయ్యింది. క్యూట్ లవ్ స్టోరీతో, ఎర్లీ ట్వీటిస్ లో ఉండే ఇబ్బందులను చాల నీట్ గా చూపించారు. ఈ మూవీ ఆల్మోస్ట్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. మమితకు తెలుగులో ఇంకా చాలా ఆఫర్స్ రానున్నాయి.