Malaika Arora : రివర్స్ ఏజింగ్.. శారీలో మలైకా స్టన్నింగ్ ఫొటోషూట్

- Advertisement -

మలైకా అరోరా.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కెవ్వు కేక పాట గురించి చెబితే.. ఓ ఆమే ఈమేనా అని అనేస్తారు. టాలీవుడ్ లో కెవ్వు కేక, రాత్రైన నాకు ఓకే వంటి స్పెషల్ సాంగ్స్ తో మలైకా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక బాలీవుడ్ లో చయ్యా చయ్యా ఎనర్ గ్రీన్ సాంగ్ తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే మున్నీ బద్నాం పాటతో ఈ భామ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అడపా దడపా సినిమాల్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయింది.

Image

ఈ భామ తన సినిమాలకంటే ఎక్కువగా ఫ్యాషన్ సెన్స్ తోనే ఫేమస్. పలు డిజైనర్లకు మోడల్ గా, డ్యాన్సర్ గా మలైకా పని చేసింది. ఇక సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుని ఓ బాబు కన్న తర్వాత కొన్నేళ్లకు ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. అప్పట్లో వీళ్ల రిలేషన్ షిప్ బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ జంట ఎక్కడికి వెళ్లినా ట్రోల్స్ చేసే వారు నెట్టింట. అయితే ఇటీవల అర్జున్-మలైకా విడిపోయారంటూ వార్తలొచ్చాయి.

- Advertisement -

Image

ఇక సోషల్ మీడియాలో మలైకా సూపర్ యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోలు పోస్టు చేసింది. ఇందులో వైట్ కలర్ శారీలో ఏంజిల్ లా కనిపించింది. స్టన్నింగ్ ఫొటోషూట్ తో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్లీవేజ్ షోతో ఓవైపు.. నడుం వొంపులు చూపిస్తూ మరోవైపు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. నాలుగు పదులు దాటిన వయసులోనూ ఈ భామ తన ఫిట్ నెస్, అందంతో కుర్ర హీరోయిన్లకు టఫ్ కాంపిటీషిన్ ఇస్తోంది.

Image

మలైకా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కొందరు నెటిజన్లు వావ్.. వాట్ ఏ బ్యూటీ అంటున్నారు. ఇంకొందరేమో.. మలైకా రివర్స్ ఏజింగ్.. ఏళ్ల గడుస్తున్న కొద్దీ అందరికి వయసు పెరిగితే ఈ భామకు మాత్రం తగ్గుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. అంతా బొటాక్స్ మహిమ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి మలైకా లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here