Mahesh Babu : అల్యూమినియం ఫ్యాక్టరీలో రహస్యంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ – రాజమౌళి మూవీ..?

- Advertisement -

Mahesh Babu అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి మహేష్ – రాజమౌళి చిత్రం. టాలీవుడ్ మార్కెట్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి తెలుగు జాతి గర్వపడేలా చేసిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహిస్తేనే రోమాలు నిక్కపొడుచుకునే పరిస్థితి ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యి దాదాపుగా దశాబ్దం దాటింది. ఈ దశాబ్ద కాలం లో రాజమౌళి బాహుబలి సిరీస్, #RRR వంటి కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉండగా, మహేష్ తానూ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చెయ్యడం లో బిజీ అయ్యాడు. ఇలా ఈ ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత ఇన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది.

Mahesh Babu
Mahesh Babu

ఒకప్పుడు రాజమౌళి కేవలం టాప్ డైరెక్టర్ మాత్రమే, కానీ ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ సూపర్ స్టార్స్ లో ఒకరు. మహేష్ బాబు కి హాలీవుడ్ స్థాయిలో స్టార్ హీరో అయ్యే అదృష్టం రాసిపెట్టింది అనుకోవాలి. అతను తీసిన సినిమాలకు, సాధించిన విజయాలకు సరైన గుర్తింపు లభించింది . ఇకపోతే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చే నెల మహేష్ పుట్టిన రోజు అనగా ఆగష్టు 9 వ తేదీన వస్తుందని అందరు అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదని మూవీ టీం ఖరారు చెయ్యడం తో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు. కానీ వారికి ఆనందం కలిగించే మరో అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

V Vijayendra Prasad on Mahesh Babu-SS Rajamouli film: 'My script should be complete by July' | Telugu News - The Indian Express

- Advertisement -

అల్యూమినియం ఫ్యాక్టరీ లో నిపుణుల సమక్షం లో వేసిన ఒక సెట్ లో ప్రతీ రోజు ఈ సినిమాలోని వచ్చే కీలక యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతూనే ఉన్నాయట. అంతే కాదు వీళ్ళ కాంబినేషన్ సినిమా వస్తున్నట్టుగా జనాలకు చెప్పేందుకు ఒక టీజర్ కట్ ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారట. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రం లో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో వీళ్ళ కాంబినేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది.

Mahesh Babu and Rajamouli SSMB 29 Filmmakers Deny Casting Rumours | Times Now

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here