Mahesh Babu : టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో యూత్ పిచ్చెక్కిపోయే హీరోల లిస్ట్ తీస్తే అందులో మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఉంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళ సినిమా రికార్డ్స్ పోటాపోటీ గా ఉంటాయి. ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోస్ ఎంత మంది కొత్తగా పుట్టుకొచ్చిన, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరు హీరోల రేంజ్ కి మాత్రం చేరుకోలేరు అని చెప్పొచ్చు.
అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి ఒక్క ప్రముఖ టాప్ నిర్మాత అడ్రెస్స్ ని గల్లంతు అయ్యేలా చేశారట. ఆ నిర్మాత మరెవరో కాదు, సి.కళ్యాణ్. ఈయన నిర్మాతగా అప్పట్లో పవన్ కళ్యాణ్ ని పెట్టి ‘కొమరం పులి’, అలాగే మహేష్ బాబు ని పెట్టి ‘ఖలేజా’ వంటి సినిమాలు చేసాడు. ఈ రెండు చిత్రాలు కూడా నెల రోజుల గ్యాప్ లో విడుదల అయ్యాయి.
కొమరం పులి చిత్రానికి ఆరోజుల్లోనే 45 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిసినెస్ జరిగింది. అలాగే ‘ఖలేజా’ సినిమాకి కూడా అదే రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్ లో విడుదల అయ్యాయి. రెండూ కూడా ఒక దానిని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పులి సినిమా ఫ్లాప్ అవ్వగానే, బయ్యర్స్ అందరూ ఖలేజా చిత్రం పై అప్పట్లో భారీ ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఈ సినిమా కొమరం పులికి మించి పెద్ద ఫ్లాప్ అయ్యింది. అలా ఈ రెండు సినిమాల వల్ల నిర్మాత సి కళ్యాణ్ కి 40 కోట్ల రూపాయిల నష్టాలు వచ్చాయట. కేవలం ఈ రెండు సినిమాల వల్లే ఆయన చాలా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ రెండు సినిమాల దెబ్బకి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడట.ఇక పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యకూడదు అని ఆయన ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాడట.