SSMB29 : త్వరలోనే షూటింగ్.. లుక్ ను రివీల్ చేసిన మహేష్..

- Advertisement -

SSMB29 టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది విడుదలైన సినిమాలు భారీ విజయాన్ని అందిస్తే.. ఈ ఏడాది విడుదలైన గుంటూరు కారం సినిమా నిరాశ పరిచింది.. అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటించడం కోసం రెడీ అవుతున్నాడు.. ఆ సినిమా కోసం తన లుక్ ను మార్చేశాడు.. ఇప్పటికే కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మహేష్ న్యూ లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

 

- Advertisement -

మహేష్, రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.. ఈ సినిమా కోసం మహేష్ లుక్ ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.. ఫోటోలలో మహేష్ న్యూ లుక్ చాలా బాగుంది.. గడ్డం, పొడవాటి జుట్టుతో మహేష్ బాబు స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా మహేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు గుడ్న్యూస్ వస్తుందా? అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వారందరికి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఆగస్ట్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ వస్తందని వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి రాజమౌళి సినిమాలు రెండు మూడేళ్లు పడతాయి.. కనీసం మహేష్ సినిమా అయిన త్వరగా వస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here