Mahesh Babu నమ్రత, సుమ రాజీవ్ కనకాల ఈ రెండు జంటల మధ్య ఉన్న సంబంధం తెలుసా.. ఇన్నేళ్లు ఎవరూ గమనింలేదుగా..!

- Advertisement -

Mahesh Babu టాలీవుడ్ సెలబ్రిటీస్ కపుల్ మహేష్ బాబు నమ్రత, సుమ రాజీవ్ కనకాల.. గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రొఫిషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో సక్సెస్‌ఫుల్ గా ముందుకు వెళ్తూ.. ఇప్పటి జనరేషన్ కపుల్స్ కి రోల్ మోడల్స్ అవుతున్నారు. అలాంటి ఈ రెండు జంటలు మధ్య ఒక చిన్న కనెక్షన్ ఉంది. అదేంటో మీకు తెలుసా..? ఆ కనెక్షన్ మరేంటో కాదు.. ఈ రెండు జంటల వివాహం ఒకే తేదీలో జరిగాయి.

సుమ, రాజీవ్ కనకాల వివహం.. 1999లో ఫిబ్రవరి 10న జరిగింది. నేటితో వీరి వివాహం అయ్యి 25 ఏళ్ళు అవుతుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. టెలివిజన్ రంగంలో పని చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ముందుగా రాజీవ్ కనకాల ప్రేమలో పడ్డారు. ఆ తరువాత సుమకి ప్రేమని తెలియజేయగా ఆమె ఒప్పుకున్నారు. ఇక ఇన్నాళ్ల దాంపత్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఈ జంట మాత్రం.. తమ అన్యోన్య దాంపత్యంతోనే అన్నిటికి బదులిస్తూ ముందుకు సాగారు. ఇక ఈ 25 ఏళ్ళ ప్రయాణాన్ని సుమ గుర్తు చేసుకుంటూ.. ‘ఒకటిగా పాతికేళ్ళు’ అంటూ రాజీవ్ తో ఉన్న ఫొటో షేర్ చేశారు.

ఇక మహేష్ బాబు, నమ్రత విషయానికి వస్తే.. వీరిద్దరి వివాహం 2005 ఫిబ్రవరి 10న జరిగింది. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమే. ‘వంశీ’ సినిమాలో నమ్రత, మహేష్ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక సూపర్ స్టార్ కృష తనయుడు, టాలీవుడ్ హీరో మహేష్ బాబు, అలాగే బాలీవుడ్ హీరోయిన్ నమ్రత.. వివాహం అంటే ఏ రేంజ్ లో అవ్వాలి. అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరగాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here