Mahesh Babu : మన టాలీవుడ్ లో సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడం లో సూపర్ స్టార్ మహేష్ బాబు ని మించిన వాళ్ళు లేరు అని అంటుంటారు. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో మహేష్ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాయి. అయితే ప్రయోగాల కారణంగా మహేష్ బాబు కి వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి.

ఇది ఆయనని ఎంతగానో అలెర్ట్ చేసింది అని చెప్పొచ్చు. అప్పటి నుండి ఆయన వరుసగా కమర్షియల్ గా బయ్యర్స్ కి లాభాలను తెచ్చిపెట్టే సేఫ్ సినిమాలనే చేస్తూ వచ్చాడు. అందుకే స్పై డర్ చిత్రం నుండి వరుసగా ఆయనకీ సూపర్ హిట్ సినిమాలే వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక వార్త మహేష్ అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేసింది. అంతే కాదు మహేష్ పై కోపం కూడా తెప్పించింది ఈ న్యూస్.

అసలు విషయానికి వస్తే రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్ ని దక్కించుకున్న చిత్రం ‘లియో’. తమిళ హీరో విజయ్ నటించిన ఈ సినిమా దాదాపుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ని ముందుగా డైరెక్టర్ లోకేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేద్దాం అని అనుకున్నాడట. మహేష్ కి కేవలం ఆయన స్టోరీ లైన్ ని మాత్రమే వినిపించాడట. కానీ వరుస ఫ్లాప్స్ తర్వాత మహేష్ పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలు చేస్తున్నాడు.

లోకేష్ ని కూడా పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మన్నాడట. ఈ గ్యాప్ లో మహేష్ చాలా సినిమాలు చేసాడు, లోకేష్ కమిట్మెంట్స్ కూడా మారాయి, మహేష్ కోసం చెప్పిన లియో స్టోరీ ని విజయ్ తో చేసాడు , గ్రాండ్ హిట్ కొట్టాడు. ఈ విషయాన్నీ తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఎలా మిస్ చేసుకున్నావ్ అన్నా, చేతులారా 600 కోట్ల రూపాయిలను పోగొట్టుకున్నావ్ కదా అంటూ సోషల్ మీడియా లో వాపోతున్నారు.
