Krishna Vamshi కొంతమంది డైరెక్టర్లు కొన్ని జానర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంటారు,అలా కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన దర్శకులలో ఒకరు కృష్ణ వంశీ. రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన గులాబీ చిత్రం తో మొట్టమొదటిసారిగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వం వహించిన నిన్నే పెళ్లాడట చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, జాతీయ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత కృష్ణ వంశీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సీనియర్ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున తో తప్ప మరో హీరో తో సినిమా చేసే అవకాశం కృష్ణ వంశీ కి దక్కలేదు.
కానీ నేటి తరం స్టార్ హీరోలలో ఆయనకీ ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారితో సినిమాలు చేసే అవకాశం దక్కింది. అయితే గోవిందుడు అందరివాడేలే చిత్రం తర్వాత సినిమాల సంఖ్య బాగా తగ్గించిన కృష్ణ వంశీ రీసెంట్ గా రంగమార్తాండ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ, విమర్శకుల ప్రశంసలను మాత్రం అందుకుంది. ఇదంతా పక్కన పెడితే గతం లో కృష్ణ వంశీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ని పోల్చి ఆయన చెప్పిన కొన్ని మాటలు వివాదాస్పదం గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ రాజకుమారుడు చిత్రం తర్వాత మహేష్ బాబు కి వరుసగా రెండు ఫ్లాపులు వచ్చాయి. అప్పుడు ఆయన ఉనికి కూడా టాలీవుడ్ లో ప్రస్నార్ధకం అన్నట్టుగా మారింది. అప్పటికే మురారి చిత్రం ఇంకా రాలేదు, మహేష్ కెరీర్ విజయవంతంగా ముందుకు పోతుందా లేదా అనే దానికి మురారి చిత్రం అత్యంత కీలకం, ఆ సినిమా సక్సెస్ కచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. ఆ సమయం లో పవన్ కళ్యాణ్ వరుస హిట్స్ తో, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. అప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న కొన్ని గ్రూప్స్ మహేష్ ని పవన్ కళ్యాణ్ తో పోల్చడం మొదలు పెట్టారు. దీంతో మహేష్ కి మీడియా లో ఫోకస్ ఎక్కువ పడింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ప్రస్తుతం వివాదాస్పదం గా మారడం తో సోషల్ మీడియా లో మహేష్ , పవన్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి.