Mahesh Babu కు సినిమాల్లోకి రావడం ఇష్టంలేదా.. ఆ వృత్తి అంటే ఇష్టమట!

- Advertisement -

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది పర‌శురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో నటించిన మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు.

Mahesh Babu
Mahesh Babu

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన‌ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం గత 20 సంవత్సరాలుగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ తో రాజమౌళి తెర‌కెక్కించిన సింహాద్రి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది పట్టాలు ఎక్కనుంది. ఇది ఇలా ఉంటే మహేష్ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒకవేళ మహేష్ సినిమాలోకి రాకపోయి ఉంటే పెద్ద డాక్టర్ అయ్యేవాడట.

Mahesh Babu Photos

మహేష్ చదువుకునే సమయంలో డాక్టర్ అవ్వాలన్న లఖ్యంగా పెట్టుకుని చదువులు కొనసాగించాడట. అయితే తన తండ్రి కృష్ణ క్రేజ్‌ చూసి తను కూడా సినిమాల్లోకి వచ్చి హీరో అవ్వాలని నిర్ణయం మార్చుకున్నాడు. ఈ క్రమంలోని 1999లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో మహేష్ హీరోగా మారాడు. మహేష్ సినిమాల్లోకి వచ్చి రెండున్నర దశాబ్దాలు పూర్తయ్యాయి. ప్రతిరోజు తన తండ్రి కృష్ణ మేకప్ చేసుకుని షూటింగ్ కు బయలుదేరుతున్న సమయంలో మహేష్ ని కూడా మేకప్ వేసుకుని తనతో పాటు షూటింగ్ లోకేషన్ కు తీసుకు వెళ్లే వారట. అలా మహేష్‌కు నటనపై ఆసక్తి కలగడంతో డాక్టర్ అవ్వాలనుకున్న లక్ష్యాన్ని అటకెక్కించే సినిమాల్లోకి వచ్చి తిరుగులేని స్టార్ హీరో అయిపోయాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here