టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో సితారకి ఓ రేంజ్ ఫ్యాలోయింగ్ ఉంది. ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. సితార ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్ చేస్తుంది. అయితే తాజాగా సితార ఓ రేర్ రికార్డుని క్రియేట్ చేసింది. తాను ఏకంగా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేసింది. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్.. తండ్రికి తగ్గ కూతురంటూ సితారపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. సితార ప్రస్తుతం పీఎంజీ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.
ఇటీవల ఈ సంస్థ ‘సితార కలెక్షన్’ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు. పిఎంజె జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషనల్ యాడ్ ను ఇటీవలె షూట్ చేశారు. ఈ యాడ్ కోసం సితార మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంది. ఇక ఈ యాడ్ ఏకంగా న్యూయార్క్ సిటీ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతుంది.
సితార యాడ్ అలా న్యూయార్క్ లో ప్రదర్శితం అవ్వడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు “సితారని టైం స్క్వేర్ పై చూడడం ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఇలాగే కొనసాగుతూ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలి” అని మహేష్ పేర్కొన్నారు. ఇక లిటిల్ ప్రిన్సెస్ యాడ్‌ను టైమ్ స్వ్కేర్‌పై చూసి అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. తండ్రికి తగ్గ కూతురు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.