Keerthi Suresh తమిళ్ బ్యూటీ కీర్తి సురేష్ తన సినీ ప్రస్థానాన్ని కోలీవుడ్ తో మొదలుపెట్టి క్రమంగా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా వెలుగొందుతోంది. నేను శైలజ మూవీ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ మహానటి చిత్రంతో తనలోని నటనా కౌశలంతో మంచి మార్కులు సంపాదించుకుంది. రీసెంట్ గా విడుదలైన దసరా మూవీలో డి గ్లామర్ పాత్రలో నటించి అందరిని మెప్పించింది.

పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహానటి చిత్రంతో కీర్తి సురేష్ కు మంచి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే అవకాశం లభించింది. వాటితో పాటుగా అగ్ర హీరోల సరసన జోడిగా కమర్షియల్ మూవీస్ కూడా చేస్తూ కీర్తి బాగా బిజీగా ఉంది. కానీ కొన్ని చిత్రాలు ఆమె ఊహించిన ఫలితాన్ని అందివ్వడంలో విఫలమయ్యాయి.

అయితే హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ మొదటి బాలీవుడ్ చిత్రం యంగ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కన్ఫర్మ్ అయింది. తమిళ్ డైరెక్టర్ ఖాళీస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
సమంత తో కలిసి సిటాడెల్ నటించిన వరుణ్ ధావన్ ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ తో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక కీర్తి విషయానికి వస్తే ప్రస్తుత ఆమె చిరంజీవి భోళా శంకర్ మూవీలో ఆయన చెల్లి క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది …ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని అభిమానుల ఆశిస్తున్నారు.