టాలీవుడ్‌లో నచ్చావులే చిత్రంతో సక్సెస్ కొట్టిన హీరోయిన్ మాధవీ లత, స్నేహితుడా, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె క్రమంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటుంది. మనసంతా కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చేయటంపైనే మనసు లగ్నం చేశానని ఆమె అంటున్నారు మరి. ఇదే సమయంలో ఆమెను ఓ ప్రశ్న పదే పదే ఇబ్బంది పెట్టింది.. ఇంతకీ ఆ ప్రశ్నేంటో తెలుసా!.. పెళ్లెప్పుడు?. సాధారణంగా ఓ ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటారు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడీ స్పీడ్ యుగంలో కెరీర్‌లో సెటిలైన తర్వాతనో.. బాగా డబ్బులు సంపాదించిన తర్వాతనో .. అదీ ఇదనే కారణాలతో పెళ్లి అనేది యువత తొందరపడటం లేదు.
తాజాగా కొందరు నెటిజన్లు ఆమెను ట్యాగ్ చేస్తూ మీ పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమేనా.. పెళ్లెప్పుడు చేసుకుంటారంటూ పొస్టులు పెట్టారు. వాళ్లకు మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వయసు ఒక్కటే సరిపోదు. దానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. అది పూర్తిగా ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేను పెళ్లికి సిద్ధంగా లేను. భవిష్యత్తులోనూ చెప్పలేను. ఇది నా జీవితం.. నేనే నిర్ణయం తీసుకుంటాను’’ అని చెప్పింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా కామెంట్లలో స్పందిస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుండగా మరి కొందరు మాత్రం కాస్త సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
గతంలో కూడా మాధవీలత రకరకా కాంట్రవర్సీ కామెంట్స్ కు సెంటర్ గా నిలిచింది.బిగ్‌బాస్‌పై.. హీరో నాగార్జునపై గట్టిగానే కామెంట్స్ చేసింది. గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మామ అంటూ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసిన బ్యూటీ.. బిగ్ బాస్ హౌస్ ముద్దులు, హగ్గులు, రొమాన్స్ కి అడ్డాగా మారిందని దుమ్మెత్తిపోసింది. ఇక పాన్ ఇండియా లేదు.. వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ అన్న పదానికి బోల్డ్ కామెంట్స్ చేసింది మాధవి. వన్ ఇండస్ట్రీ నా.. బొక్కేం కాదు… టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ని చూడరు.. నిజమైన టాలెంట్ కి స్కోప్ లేదు.. అందుకే చాలా మంది హీరోయిన్లు తమిళ్ కి వెళ్లి అక్కడ రాణిస్తున్నారు అన్నారు మాధవీలత. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.