లస్ట్ స్టోరీస్.. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా ఎన్నో విమర్శలు ఎదురుకున్నప్పటికీ మంచి సక్సెస్ నే అందుకుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రానికి సీక్వెల్ ని రెడీ చేసి తీసుకు రాబోతుంది. అయితే ఈ సీక్వెల్ కి ఫస్ట్ పార్ట్ తో ఎటువంటి కనెక్షన్ లేదు. ఈ సినిమాలో.. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ,అమృత సుభాష్, అంగద్ బేడీ.. వంటి స్టార్స్ అంతా నటిస్తున్నారు.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది..ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.. రొమాంటిక్ లవర్స్ ను ఆకట్టుకుంది.. తాజాగా ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లో కంటే ఈ సెకండ్ పార్ట్ లో మరింత అడల్ట్ కంటెంట్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా.. అందరి కళ్ళు తమన్నా, విజయ్ వర్మ పైనే ఉన్నాయి. ప్రేమ రూమర్స్ తో వీరిద్దరూ వార్తల్లో నిలవడం, ఇప్పుడు ఈ సిరీస్ లో ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తుండడంతో ప్రేక్షకుల దృష్టి అంతా వారిపైకే వెళ్తుంది. ట్రైలర్ లో కూడా వీరిద్దరి రోమాన్స్ మాత్రమే ప్రధానంగా చూపించడంతో ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకుంది… సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి..
ఇకపోతే మృణాల్ ఠాకూర్, కాజోల్ మంచి ప్రేమ సినిమాలతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దర్నీ ఇలాంటి సినిమాలో చూడడానికి అభిమానులు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. కాగా ఈ సినిమాని అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, R బాల్కి, సుజోయ్ ఘోష్ లు డైరెక్ట్ చేశారు. సినిమాలో మొత్తం నాలుగు సిగ్మెంట్స్ ఉండగా.. ఒకొక సిగ్మెంట్ ని ఒకొక డైరెక్టర్ చిత్రీకరించారు.. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో రూ.199 లు చెల్లించి ఈ చిత్రాన్ని చూడవచ్చు… మొత్తానికి ట్రైలర్ లో అయితే ఓ రేంజులో ట్రెండ్ అవుతుంది.. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..