Ayodhya Rama ఇటీవలే అయోధ్య లో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట ఎంత ఘనంగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి భక్తులు హాజరు అయ్యారు. వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు కూడా సాధారణ వ్యక్తులు లాగ ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరై భక్తి పారవశ్యం లో మునిగితేలారు. ఈ ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుండి సాధారణ భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం ని కల్పించారు.
ఇది ఇలా ఉండగా శ్రీ రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరో శిల్పి అద్భుతంగా రాముడి విగ్రహాన్ని తయారు చేసాడని, దీనిని చూస్తున్నంత సేపు విగ్రహం లాగ అనిపించడం లేదని, సాక్షాత్తు శ్రీరాముడే మళ్ళీ అయోధ్య కి విచ్చేశాడు అనేంత గొప్పగా శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేసాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే శ్రీ రాముడి కళ్ళను చూస్తుంటే మా అభిమాన హీరో కళ్ళు గుర్తుకు వస్తున్నాయి అంటూ తమిళ హీరో విజయ్ కాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే విజయ్ కాంత్ అస్వస్థతతో తన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న విజయ్ కాంత్, మళ్ళీ కోలుకొని బయటకి వచ్చిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కానీ మధ్యలో కరోనా రావడం తో ఆయన ఆరోగ్యం మరింత విషమించి చనిపోయాడు. అందుకే ఆయన అభిమానులు శ్రీ రాముడి కళ్ళను విజయ్ కాంత్ తో పోల్చి చూసినా కూడా ఎవ్వరూ సీరియస్ అవ్వడం లేదు. అభిమానులు అన్న తర్వాత అలాగే ఉంటారు, ఎవరి ఆనందం వారిది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కాంత్ చనిపోయి నేటికి సరిగ్గా నెల రోజులు పూర్తి అయ్యింది.