Jayam Movie : మన టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ లలో సరికొత్త ట్రెండ్ ని నెలకొల్పిన చిత్రాలలో ఒకటి జయం. నితిన్ ని హీరో గా పరిచయం చేస్తూ, డైరెక్టర్ తేజా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని, ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

ఈ సినిమా ద్వారానే హీరోయిన్ సదా కూడా పరిచయం అయ్యింది. ఇక టీ కృష్ణ కొడుకు గోపీచంద్ ఈ సినిమా ద్వారా విలన్ గా పరిచయం అయ్యాడు. అంతకు ముందు ఆయన తొలివలపు అనే సినిమాలో హీరో గా చేసాడు, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ సినిమాలో పోషించిన విలన్ పాత్రకి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇకపోతే ఈ సినిమా లో సదా చెల్లెలుగా నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈమె ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏ చిత్రంలోనూ నటించలేదు. ఈ అమ్మాయి పేరు యామిని శ్వేతా. పెద్దయ్యాక ఈ అమ్మాయి పలు యాడ్స్ లో నటించింది కానీ, సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు పెద్దగా ఆసక్తి మాత్రం చూపడం లేదు. కానీ సోషల్ మీడియా లో ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు లీక్ అయ్యి తెగ వైరల్ గా మారాయి.

ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయి ఎందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అని ఈమె ఫోటోలు చూసిన తర్వాత మీకు అనిపించక తప్పదు. ఎవరెవరో వచ్చి ఇక్కడ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు, ఇలాంటి అచ్చ తెలుగు అమ్మాయిలు కదా ఇండస్ట్రీ కి రావాలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.


