Leo Movie : కోలీవుడ్ నుంచి ఎన్నో అంచనాలతో విడుదల అవుతున్న సినిమా ‘లియో’ చుట్టూ కూడా ఇలాంటి ఒక కాంట్రవర్సీనే అల్లుకుంది. తాజాగా విడుదలయిన ట్రైలర్‌లో బూతులు ఉన్నాయంటూ కొందరు ప్రేక్షకులు దానిని ఖండించడం మొదలుపెట్టారు. ఇక ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుండగా.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ రియాక్ట్ అయ్యాడు. విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రమే ‘లియో’.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘మాస్టర్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. అందుకే ‘లియో’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా ‘లియో’ అనేది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అనే అంశం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తోంది. ఇదే సమయంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ ట్రైలర్‌లో విజయ్ ఒక బూతు పదాన్ని ఉపయోగించడం, అది మూవీ టీమ్ మ్యూట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా లోకేశ్ కనకరాజ్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఈ కాంట్రవర్సీ గురించి తనకు ప్రశ్న ఎదురయ్యింది. అందులో ‘లియో’ ట్రైలర్‌లో ఉన్న బూతుల గురించి తనకు ప్రశ్న ఎదురవ్వగా..
అసలు బూతు పదాలు ఉపయోగించడం తన ఉద్దేశం కాదని, ఆ సీన్‌లో క్యారెక్టర్ ఎమోషన్స్‌ను స్పష్టంగా చూపించడం కోసం ఉపయోగించక తప్పలేదని అసలు విషయాన్ని బయటపెట్టాడు లోకేశ్. అంతే కాకుండా విజయ్ కూడా అలా మాట్లాడడానికి ముందు ఇష్టపడలేదని, అలా మాట్లాడడం ఓకేనా కాదా అని పదేపదే ఆలోచించాడని లోకేశ్ అన్నాడు. కానీ సినిమా కోసం విజయ్‌ను తానే ఒప్పించానని, అందుకే ఇప్పుడు ఈ పరిణామానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని లోకేశ్ ఓపెన్‌గా చెప్పేశాడు.