Lokesh Kanagaraj : వరుస హిట్ సినిమాలను డైరెక్ట్ చేసి హిట్స్ కొడుతూ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తాను తొలిసారి వెండితెరపై నటించబోతున్నాడు. అది కూడా గోల్డెన్ బ్యూటీ శృతి హాసన్‌తో రొమాన్స్ చేయనున్నాడు. అయితే ఇది సినిమాలో కాదు. లోకేష్ కనగరాజ్ ఓ మ్యూజిక్ వీడియో ద్వారా నటుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. ప్రేమ అనే గొప్పదనాన్ని గురించి చెప్పే మ్యూజిక్ వీడియోలో లోకేష్ నటిస్తున్నాడు.

ఈ పాటను శృతి హాసన్ స్వయంగా రాయడమే కాదు.. దీనికి సంగీతం కూడా అందించింది. కూతురు మ్యూజిక్ ఆల్బమ్‌కు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మ్యూజిక్ వీడియోని తన ప్రొడక్షన్ హౌస్ రాజకమల్ ఇంటర్నేషనల్ ద్వారా విడుదల చేయనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రుతిహాసన్, లోకేష్ కనగరాజ్‌ల మ్యూజిక్ వీడియో సాంగ్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్ గురువారం చెన్నైలో ప్రారంభం కానుంది. రెండు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది.
ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్, శృతి హాసన్ కెమిస్ట్రీ హైలైట్ కానుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న లోకేశ్ కనగరాజన్ దర్శకుడిగా బిజీగా ఉండడంతో హీరోగా పలు అవకాశాలను వదులుకుంటున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ స్టంట్ మాస్టర్ అనుబ్ రువ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. రీసెంట్‌గా సలార్‌తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న శృతి హాసన్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఇంగ్లీషులో ది ఐ అనే సినిమాలో కూడా నటిస్తుంది.