JR NTR వైఫ్ లక్ష్మీ ప్రణతికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రణతిని ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించమని అడిగారంట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఆ డెరెక్టర్ ఎవరో కాదు. కేజీఎఫ్ తో ఫిలిం ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న స్టార్ ప్రశాంత్ నీల్. త్వరలోనే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూట్ అయిపోగానే ఎన్టీఆర్- 31 సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ప్రశాంత్- ఎన్టీఆర్ ఫ్యామిలీ టైంలో సరదాగా లక్ష్మి ప్రణతిని ఆటపట్టించారంట. నువ్వు కూడా ఎన్టీఆర్ మూవీలో రోల్ చేయు.. గుర్తుంటుంది.. ఫ్యాన్స్ కూడా ఖుష్ అవుతారు అని ప్రశాంత్ నీల్ సజెస్ట్ చేశారంట. అయితే లక్ష్మీ ప్రణతి మాత్రం దానికి ఇంట్రెస్ట్ చూపించలేదట .

తనకు అసలు యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదని చెప్పిందంట. ఎన్టీఆర్ పక్కన జస్ట్ నిల్చో అంతకు మించి యాక్టింగ్ అవసరం లేదని ప్రశాంత్ నీల్ ఫోర్స్ చేశారంట. అయితే ఎన్టీఆర్ మాత్రం సైలంట్ గా వచ్చి ప్రణతికి అలాంటివి ఇష్టం ఉండదు.. ఆమెను ఇబ్బంది పెట్టడం వేస్ట్ అని ఘాటుగా ఆన్సర్ ఇచ్చారంట. దీంతో ప్రశాంత్ ఆ టాపిక్ మరోసారి ఎత్తలేదంట. ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ గా మారింది.