RGV : ఒకప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ ఇండియన్ సినిమా ని టెక్నికల్ గా వేరే లెవెల్ కి తీసుకెళ్లిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బూతు సినిమాలు, మరియు వివాదాలను క్యాష్ చేసుకుంటూ సినిమాలను తెరకెక్కించే స్థాయికి పడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ‘శివ’ సినిమా టేకింగ్ చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోతాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు.
సోషల్ మీడియా లో ఈయన తరచూ ఎదో ఒక అంశం మీద నెగటివ్ కామెంట్స్ చేస్తూ తద్వారా అటెన్షన్ ని పొందాలని చూస్తూ ఉంటాడు. చిన్న పిల్లాడి మైండ్ సెట్ కంటే దారుణంగా తయారైంది ఈయన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇతను ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ పార్టీ కి అనుకూలంగా పనిచేస్తున్నాడు. ముంబై లో అప్పులతో ఆస్తులు దివాలా తీసే పరిస్థితి కి రావడం తో ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇతనిని పిలిపించి తనకి సపోర్టుగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సినిమా తియ్యమని ఆఫర్ ఇచ్చాడు.
రెండు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి ని ఈ సినిమా కథ చర్చించడానికి కలిసాడు కూడా. అలా ‘వ్యూహం’ సినిమా ప్రారంభించాడు. ఈ సినిమా చెయ్యడానికి రామ్ గోపాల్ వర్మ కి ఒక ప్యాకేజి గా 100 కోట్ల రూపాయిలు ఇచ్చారట ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు అసలు జనాలు రామ్ గోపాల్ వర్మ ని పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి సమయం లో ఆయన సినిమాలను చూస్తారా అంటే అనుమానమే.
ఒకవేళ సూపర్ హిట్ అయినా కూడా పది కోట్ల రూపాయిల షేర్ కి మించి వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. మరి వంద కోట్ల రూపాయిలు ఆయనకీ ఎలా ఇచ్చారు అని మీకు అనిపించొచ్చు. కానీ ఈ వంద కోట్ల రూపాయలు కేవలం వ్యూహం సినిమా చెయ్యడం కోసమే కాదు. 5 సంవత్సరాల పాటు వివిధ యాంగిల్స్ లో జగన్ చెప్పినట్టు సినిమాలు చేస్తూనే ఉండాలి. అంటే వ్యూహం లాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి అన్నమాట రాబోయే రోజుల్లో.