మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి అందిరికీ తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి, సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం.

అలాంటి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గత ఏడాది చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. అలాంటి డిజాస్టర్ ఫ్లాప్ ని మళ్ళీ ఎంత కస్టపడి ప్రయత్నం చేసిన చిరంజీవి అందుకోలేడని అందరూ అనుకున్నారు. కానీ ‘భోళా శంకర్ ‘ సినిమాతో చిరంజీవి తన రికార్డుని తానే బద్దలు కొట్టుకున్నాడు.

వీకెండ్ లోనే చాలా పూర్ వసూళ్లను నమోదు చేసుకున్న ‘భోళా శంకర్’ చిత్రం ,ఇక వర్కింగ్ డేస్ లో అయితే కుప్పకూలిపోయింది. చాలా ప్రాంతాలలో మూడు వారాల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం కంటే తక్కువ వసూళ్లు రావడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబట్టే అలవాటు ఉన్న చిరంజీవి కి ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే జనాలు రీమేక్ సినిమాలపై ఎంత విసిగెత్తిపోయి ఉన్నారో అర్థం అవుతుంది.

ఇకపోతే ఈ చిత్రానికి నిన్న గుంటూరు ప్రాంతం లో కేవలం 57 వేల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది మాములు అవమానం కాదు. ఇదే వర్కింగ్ డే రోజు జైలర్ చిత్రానికి ఈ ప్రాంతం లో 21 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఎంత తేడా ఉందో చూసారా..?, ఇకపోతే అమెరికా లో అయితే నిన్న ఈ చిత్రానికి 17 రోజుల క్రితం విడుదలైన ‘బ్రో ది అవతార్’ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. అలా చిరంజీవి ఈ సినిమా ద్వారా అభిమానులు కలలో కూడా ఊహించని అవమానాలను ఎదురుకుంటున్నాడు.
