Ananya : లైగర్ బ్యూటీ అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఎఫైర్ బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆదిత్య రాయ్ కపూర్ కి అనన్య పాండే బర్త్ డే విషెస్ చెప్పిన తీరు చర్చకు దారి తీసింది. ఆదిత్య రాయ్ బర్త్ డే సందర్భంగా అనన్య పాండే బర్త్ డే విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. స్వయంగా తాను తీసిన ఆదిత్య పిక్ పోస్ట చేసిన లైగర్ బ్యూటీ.. హ్యాపీ బర్త్ డే ఎస్డీ అని పోస్ట్ చేసింది. అలాగే హార్ట్ ఎమోజీని జత చేసింది. దీంతో అనన్య- ఆదిత్య ప్రేమలో ఉన్నారని బీటౌన్ కోడై కూస్తుంది.

అనన్య పాండే జన్మదిన వేడుకలకు వీరు జంటగా మాల్దీవులు వెళ్లినట్లు సమాచారం. గత ఏడాది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలీ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు ఆదిత్య రాయ్ కపూర్, అనన్య బ్లాక్ కలర్ ట్విన్ డ్రెస్ లో హాజరయ్యారు. ఆ పార్టీలో వీళ్లు హైలెట్ అయ్యారంట. ఈ విషయంపై కాఫీ విత్ కరణ్ షోలో గుచ్చి గుచ్చి అడిగాడు. కానీ అనన్య మాత్రం ఏ విషయాన్నీ కన్ఫాం చేయలేదు. అనన్యతో పాటు షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ సైతం ఆదిత్య రాయ్ కపూర్ అనన్య లవర్ అంటూ టీజింగ్ చేసింది. కాగా ఆదిత్య రాయ్ కపూర్, అనన్య లవ్ ఎఫైర్ ని ఆమె తండ్రి చంకీ పాండే ఖండించడం విశేషం. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణం అంటూ ఆయన కొట్టిపారేశారు.
అనన్య తెలుగులో లైగర్ మూవీలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ నిరాశపరిచింది. విజయ్ దేవరకొండతో అనన్య కెమిస్ట్రీ మాత్రం హైలెట్ అని చెప్పాలి. ప్రస్తుతం అనన్య హిందీలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.
